పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సన్నద్ధంగా ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు బండ్రు శోభారాణి తెలిపారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉదయం జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకులతో రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ సమీక్షా సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణాలతోపాటు... లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లను సత్కరించారు.
తెదేపా సిద్ధం... - తెదేపా సమావేశం
లోక్సభ ఎన్నికల కోసం తెదేపా సిద్ధమవుతోంది. ఇవాళ ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకులతో రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
ఎల్ రమణ