గోవధపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌ను టీటీడీ బోర్డు సభ్యుడు, యుగతులసి ఫౌండేషన్ ఛైర్మన్ కె. శివకుమార్ కలిశారు. సీపీ కార్యాలయానికి వెళ్లి... దూడలు, ఎద్దులు అక్రమ వధపై చర్చించారు. నగరంలో గోవుల అక్రమ రవాణ, గోవధ జరగకుండా చూడాలని సీపీకి... శివకుమార్ విజ్ఞప్తి చేశారు.
గోవధపై హైదరాబాద్ సీపీని కలిసిన టీటీడీ బోర్డు సభ్యుడు - గోవధపై హైదరాబాద్ సీపీని కలిసిన టీటీడీ బోర్డు సభ్యుడు
హిందువుకు అత్యంత పవిత్రమైన గోవులను వధించకుండా చూడాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు టీటీడి బోర్డు సభ్యుడు కె. శివకుమార్ వినతి పత్రం అందించారు. గోమాత రక్షణ కోసం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
గోవధపై హైదరాబాద్ సీపీని కలిసిన టీటీడీ బోర్డు సభ్యుడు
గోవులను హత్య చేస్తే వారి పైన యానిమల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు, మూడు రోజుల్లో హైదరాబాద్‌లో అనేక ఆవులు వధించడానికి తీసుకొచ్చారని... అలా జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇలాంటి చర్యలు జరగకుండా చూడాలన్నారు. అనంతరం సీపీకి వినతి పత్రం అందించారు.
ఇదీ చూడండి:అయోధ్య శోభాయమానం- భూమిపూజకు ముస్తాబు
TAGGED:
ttd member meet hyderabad cp