తెలంగాణ

telangana

ETV Bharat / state

Dana prasadam: శ్రీవారి భక్తులకు నూతనంగా 'ధనప్రసాదం' - తితిదే వార్తలు

శ్రీవారి ధన ప్రసాదం పేరుతో తితిదే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా గదుల కోసం డిపాజిట్ చేసిన నగదును చిల్లర రూపంలో చెల్లించనున్నారు.

ttd
ttd

By

Published : Sep 1, 2021, 10:36 PM IST

తిరుమల శ్రీవారి దేవస్థానంలో నూతన కార్యక్రమం ప్రారంభమైంది. శ్రీవారి 'ధన ప్రసాదం' పేరిట నూతన కార్యక్రమాన్ని తితిదే ప్రారంభించింది. గదుల కోసం డిపాజిట్ చేసిన నగదును చిల్లర రూపంలో అందిస్తున్నారు. శ్రీవారి హుండీ నాణేలను డిపాజిట్ చేసుకునేందుకు బ్యాంకులు ముందుకు రావటం లేదు.

దీంతో తితిదే వద్ద పెద్ద మొత్తంలో చిల్లర నాణేలు పేరుకుపోతున్నాయి. ఈ చిల్లర నాణేల నిల్వలను తగ్గించేందుకు.. ధన ప్రసాదంగా అందించనున్నారు. అనగా గదుల కోసం డిపాజిట్ చేసిన నగదును తిరిగి భక్తులకు చిల్లర రూపంలో అందిస్తుంది.

ఇదీ చూడండి:YADADRI: తిరుమల తరహాలో యాదాద్రిలో రాగి హుండీలు

ABOUT THE AUTHOR

...view details