TTD on Tirumala Drone Visuals: ఆంధ్రప్రదేశ్లోని తిరుమల ఆలయం డ్రోన్ దృశ్యాలపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. హైదరాబాద్కు చెందిన ఓ సోషల్ మీడియా సంస్థ.. డ్రోన్ దృశ్యాలను సామాజిక మాధ్యమంలో ప్రసారం చేసినట్లు గుర్తించామని ఆయన తెలిపారు. ఆ సంస్థపై కేసు నమోదు చేస్తామని అన్నారు. పటిష్ట భద్రత ఉన్న ఆలయంపై డ్రోన్ చిత్రీకరణకు అవకాశం లేదని.. గతంలో తీసిన చిత్రంతో యానిమేట్ చేసి దృశ్యాలు తయారు చేశారా అనే కోణంలో విచారిస్తామని పేర్కొన్నారు. పూర్తి స్థాయి విచారణకు అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. డ్రోన్ దృశ్యాలు, చిత్రాలపై భక్తులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.
ఆలయంపై డ్రోన్ చిత్రీకరణకు అవకాశం లేదు: టీటీడీ ఛైర్మన్ - నేటి తెలుగు వార్తలు
TTD on Tirumala Drone Visuals: ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి డ్రోన్ దృశ్యాలు కలకలం సృష్టించాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు ప్రసారమయ్యాయి. దీనిపై టీటీడీ ఛైర్మన్ స్పందించారు. వారు ఏమన్నారంటే..
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల శ్రీవారి ఆలయంపై ఎలాంటి వస్తువులు ఎగరడానికి వీలులేదనే నిబంధన ఉంది. అలాగే నో ఫ్లై జోన్ కావటంతో.. ఈ దృశ్యాలు ప్రసారం కావటంతో పలు విమర్శలు వస్తున్నాయి. శ్రీవారి ఆనంద నిలయం, ఆనంద నిలయ గోపురాలకు సంబంధించిన దృశ్యాలలో చిత్రీకరించారు.
ఇవీ చదవండి :