తెలంగాణ

telangana

ETV Bharat / state

తితిదే సేవల విస్తృతానికి ఆలయాల విలీనం: వైవీ సుబ్బారెడ్డి - ap news

ఏపీలోని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పర్యటించారు. కార్వేటినగరం, శ్రీరంగరాజపురం, పెనుమూరు మండలాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

తితిదే సేవల విస్తృతానికి ఆలయాల విలీనం: వైవీ సుబ్బారెడ్డి
తితిదే సేవల విస్తృతానికి ఆలయాల విలీనం: వైవీ సుబ్బారెడ్డి

By

Published : Dec 17, 2020, 10:53 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం సేవలను విస్తృతపరిచేందుకు పలు ఆలయాలను విలీనం చేసుకున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా కార్వేటినగరం, శ్రీరంగరాజపురం, పెనుమూరు మండలాల్లో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామితో కలిసి తితిదే ఛైర్మన్ పర్యటించారు.

పర్యటనలో భాగంగా... కార్వేటినగరంలోని తితిదే అనుబంధ ఆలయమైన శ్రీ వేణుగోపాలస్వామి మందిరంలో పూజలు చేశారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇటీవల తితిదేలో విలీనమైన ఆలత్తూరు వరద వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ఆలయ అధికారులకు సంబంధిత పత్రాలు అందజేశారు. శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లి గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు.

పెనుమూరు మండలంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న నేతలకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీచదవండి:మా కాలనీకి రోడ్డు వేయండి.. ఎమ్మెల్యేకు బాలుడి విన్నపం

ABOUT THE AUTHOR

...view details