తలనీలాల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానంపై సామాజిక మాధ్యమాల్లో అనవసరంగా నిందిస్తున్నారని.. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. మిజోరంలో పోలీసులు నమోదు చేసిన కేసులో తితిదే పేరే లేదని స్పష్టం చేశారు. అత్యంత పారదర్శకంగా ఈ-వేలం ద్వారా తలనీలాలను విక్రయిస్తామని.. దీనిపై అసత్య ప్రచారం తగదని తెలిపారు.
'ఈ - వేలం ద్వారానే తలనీలాలను విక్రయిస్తాం..' - ap news
తితిదేను అనవసరంగా నిందిస్తున్నారని అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. మిజోరం పోలీసులు నమోదు చేసిన కేసులో తితిదే పేరు లేదని పేర్కొన్నారు. ప్రాసెస్ చేయని తలనీలాలను మిజోరం పోలీసులు సీజ్ చేశారని వెల్లడించారు.
ttd, ttd eo, dharma reddy pc
తితిదే ఉన్నతాధికారులతో అదనపు ఈవో ధర్మారెడ్డి సమావేశం అయ్యారు. కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్రలపై చర్చించారు. కొవిడ్ దృష్ట్యా తిరుపతిలో జారీచేసే టైంస్లాట్ టోకెన్లు తగ్గించామన్నారు. భక్తులంతా కొవిడ్ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
ఇదీ చదవండి:మయన్మార్లో పట్టుబడిన తలనీలాలతో మాకు సంబంధం లేదు: తితిదే