తెలంగాణ

telangana

ETV Bharat / state

గణేష్​ నిమజ్జనానికి విద్యుత్​ శాఖ ఏర్పాట్లు - గణేష్​ శోభాయాత్రకు విద్యుత్​ శాఖ ఏర్పాట్లు

గణేష్ విగ్రహాల శోభాయాత్ర సజావుగా నిర్వహించేందుకు విద్యుత్ సంస్థ తగిన ఏర్పాట్లు చేపడుతుందని.. మండప నిర్వాహకులు, ప్రజలు విద్యుత్ భద్రత సూచనలు పాటిస్తూ, తమ శాఖ వారికి సహకరించాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి కోరారు. హైదరాబాద్​లో సెప్టెంబర్​ 12న జరిగే గణేష్​ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగేలా తమ శాఖ తరఫున అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

గణేష్​ శోభాయాత్ర

By

Published : Sep 6, 2019, 6:12 AM IST

Updated : Sep 6, 2019, 7:42 AM IST

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెప్టెంబర్​ 12న నిర్వహించే గణేష్ నిమజ్జనానికి విద్యుత్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసే 44 చెరువులు, కుంటల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా కోసం 500 కె.వి.ఏలు కలిగిన 27 విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను, 315 కె.వి.ఏలు కలిగిన 38, 160 కె.వీ.ఏ కలిగిన 12, 100 కె.వీ.ఏ కలిగిన 4 ట్రాన్స్​ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 42 కిలోమీటర్ల ఎల్​ టీ కేబుల్స్​ను ఏర్పాటు చేశామన్నారు. రోడ్ క్రాసింగ్​లు, వదులుగా ఉన్న తీగలు సరి చేయటం, ట్రాన్స్​ఫార్మర్ల వద్ద ఎర్తింగ్, అవసరమైన చోట ఇన్సులేషన్ పనులు చేపట్టినట్టు సీఎండీ వివరించారు.

కంట్రోల్​రూంలు ఏర్పాటు

గ్రేటర్ హైదరాబాద్​లో సర్దార్ మహల్, హుస్సేన్​ సాగర్, బషీర్ బాగ్, గాంధీనగర్, సరూర్​నగర్ ప్రాంతాల్లో 9 కంట్రోల్ రూమ్​లను ఏర్పాటు చేస్తున్నామని రఘుమారెడ్డి తెలిపారు. నిమజ్జన కార్యక్రమంలో విద్యుత్ సరఫరా తీరుతెన్నుల పర్యవేక్షణకు సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీనివాస రెడ్డి ఇంఛార్జీగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.

ప్రతి మండపం వద్ద ఉద్యోగి

నగరంలో గణేష్​ మండపాలకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించాలని ఎస్సీడీసీఎల్​ సీఎండీ అధికారులకు సూచించారు. ప్రతి మండపం వద్ద ఒక ఉద్యోగిని నియమించాలని... విగ్రహ నిమజ్జనం పూర్తయ్యే వరకు విగ్రహం వెంట ఉండాలని అన్నారు. రహదారులపై కేబుల్, ఇంటర్నెట్, ఫోన్ వంటి తీగలు అడ్డంగా ఉంటే అవి తొలగించాల్సిందిగా సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : కేసీఆర్‌ నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయి: అఖిలపక్షం

Last Updated : Sep 6, 2019, 7:42 AM IST

ABOUT THE AUTHOR

...view details