తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు.. అరెస్టులు.. - tsrtc Workers coming to the depots and Policies are blocking

నిజామాబాద్ జిల్లాలో గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి
నిజామాబాద్ జిల్లాలో గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

By

Published : Nov 26, 2019, 8:06 AM IST

Updated : Nov 26, 2019, 9:59 AM IST

09:54 November 26

నిజామాబాద్ జిల్లాలో గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళ్‌పాడులో  ఆర్టీసీ డ్రైవర్ రాజేందర్​(55) గుండెపోటుతో  మృతి చెందాడు. 

09:53 November 26

సిద్దిపేటలో 100 మంది ఆర్టీసీ కార్మికుల అరెస్టు

సిద్దిపేట ఆర్టీసీ డిపోలో విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 100మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నారు.

09:42 November 26

డిపోల వద్ద పోలీసులు 144 సెక్షన్​ను అమలు

రాష్ట్ర వ్యాప్తంగా డిపోల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. విధుల్లో చేరేందుకు డిపోలకు కార్మికులు చేరుకుంటున్నారు. లోనికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ.. పోలీసులు వారిని గేటు బయటే నిలిపివేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. అన్ని డిపోల వద్ద పోలీసులు 144 సెక్షన్​ను అమలు చేశారు. విధుల్లోకి వస్తున్న తాత్కాలిక కార్మికులను మాత్రమే అనుమతించాలని... సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు ప్రవేశం లేదని ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

08:41 November 26

డిపో మేనేజర్​ కాళ్లు మొక్కిన ఆర్టీసీ మహిళా కండక్టర్లు

నిజామాబాద్ డిపో-1 వద్దకు ఆర్టీసీ కార్మికులు ర్యాలీగా చేరుకున్నారు. విధుల్లో చేరుతామని డిపో మేనేజర్‌కు కార్మికులు వినతిపత్రం అందజేశారు. డిపో మేనేజర్ కాళ్లు మొక్కి కన్నీళ్లపర్యంతమయ్యారు ఆర్టీసీ మహిళా కండక్టర్లు.

08:39 November 26

రాష్ట్రవ్యాప్తంగా బస్సు డిపోల వద్ద ఆందోళన, ఉద్రిక్తత

రాష్ట్రవ్యాప్తంగా బస్సు డిపోల వద్ద ఆందోళన, ఉద్రిక్తత నెలకొంది. అన్ని డిపోల వద్దకు ఆర్టీసీ కార్మికులు చేరుకుని... విధుల్లో చేర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  డిపోల వద్దకు చేరుకుంటున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. 

08:30 November 26

పోలీసుల అదుపులో ఉన్న ఆర్టీసీ కార్మికుడికి గుండెపోటు

సంగారెడ్డిలో  పోలీసుల అదుపులో ఉన్న ఓ ఆర్టీసీ కార్మికుడికి గుండెపోటు వచ్చింది. కార్మికుడు బీమ్లాను స్థానిక ఆస్పత్రికి తరలించారు. విధుల్లో చేరేందుకు వచ్చిన కండక్టర్ బీమ్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

08:27 November 26

కాచిగూడ డిపోలో విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికుల అరెస్టు

హైదరాబాద్​ కాచిగూడ డిపో పరిధిలో విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. అధికారుల అనుమతి నిరాకరణతో కాచిగూడ డిపో ఎదుట కార్మికుల ధర్నా చేపట్టగా.. 60 మంది కార్మికులను  పోలీసులు అరెస్టు చేశారు. కాచిగూడలో తాత్కాలిక డ్రైవర్లతో యథావిధిగా  బస్సులు నడుస్తున్నాయి.

08:25 November 26

బర్కత్‌పురా డిపో వద్ద 40 మంది కార్మికులు అరెస్టు

హైదరాబాద్‌ బర్కత్‌పురా డిపో వద్ద కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. 40 మంది కార్మికులను అరెస్టు చేసి ఓయూ పీఎస్‌కు తరలించారు. 

07:48 November 26

రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు.. అరెస్టులు..

తెలంగాణ ఆర్టీసీ ఐకాస పిలుపు మేరకు సమ్మె విరమించి, విధుల్లోకి చేరేందుకు డిపోలకు వెళ్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆర్టీసీ యాజమాన్యం అనుమతి లేనందువల్ల విధుల్లో చేరడం కుదరదంటూ కార్మికులను వెనక్కిపంపిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఆర్టీసీ ఐకాస నేతల ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు.. వారిని  ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. దీనితో పలుచోట్ల పోలీసులు, కార్మికుల మధ్య తోపులాటలు జరిగాయి.

Last Updated : Nov 26, 2019, 9:59 AM IST

For All Latest Updates

TAGGED:

tsrtc strike

ABOUT THE AUTHOR

...view details