తెలంగాణ

telangana

ETV Bharat / state

సంక్రాంతికి స్పెషల్ బస్సులు.. సొంతూళ్లకు వెళ్లే వారికోసమే..

TSRTC Sankranti Special Buses: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికోసం.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 4 వేల 233 ప్రత్యేక బస్సులు నడిపించాలని అధికారులు నిర్ణయించారు. అందులో 585 సర్వీసులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.

By

Published : Dec 11, 2022, 6:21 PM IST

TSRTC
టీఎస్ఆర్టీసీ

TSRTC Sankranti Special Buses: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారు ఇబ్బందులు పడకుండా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే.. జనవరి 7 నుంచి 15వ తేది వరకు 4,233 ప్రత్యేక బస్సులను నడపనుంది. అందులో 585 సర్వీసులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు.. ఇతర అంశాలపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హైదరాబాద్ బస్ భవన్ నుంచి ఉన్నతాధికారులు, ఆర్ఎంలు, డీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతేడాది కన్నా ఈ సంక్రాంతికి.. 10 శాతం అదనపు బస్సులను నడుపుతున్నామని ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్ణణాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపేలా చర్యలు తీసుకోవాలని.. ఆర్​ఎమ్​లు, డీఎమ్​లకు సజ్జనార్ సూచించారు. రాబోయే 60 రోజులు తెలంగాణ ఆర్టీసీకి ఎంతో ముఖ్యమైనవని.. అందుకనుగుణంగా సిబ్బంది పనిచేయాలని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం అడ్వాన్స్‌ టికెట్ బుకింగ్​ను 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచినట్లు తెలిపారు. ప్రయాణికులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details