TSRTC merging with government Bill : ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనానికి బిల్లు రూపకల్పన ప్రక్రియ మొదలైంది. ఈ బిల్లులో చేర్చాల్సిన అంశాలను ఆర్టీసీ అధికారులు దాదాపు కొలిక్కి తెచ్చారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆర్టీసీకి వచ్చే ఆదాయంపై రెండేళ్ల పాటు ప్రభుత్వం మారిటోరియం ఇవ్వనుందని తెలిసింది. అంటే.. ఆ ఆదాయంలో ప్రభుత్వం ఏమీ తీసుకోదు. సంస్థ అవసరాలకే వినియోగించుకోవచ్చు.
TSRTC merging with government Bill :అదే సమయంలో.. చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. రెండేళ్ల తర్వాత మాత్రం ప్రతి నెలా సంస్థ ఆదాయంలో 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మిగిలిన 75 శాతం ఆదాయాన్ని బస్సుల నిర్వహణ, డీజిల్, ఇతర ఖర్చులకు వినియోగించుకోవచ్చు. ఈ అంశాలను బిల్లులో చేరుస్తున్నారు. రేపు ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
TSRTC merging with government Bill in Assembly :ప్రస్తుతం సంస్థకు సగటున నెలకు 471 కోట్ల ఆదాయం వస్తుండగా.. ఉద్యోగులకు వేతనాలు, పీఎఫ్ వాటా చెల్లింపు, పింఛన్లు కలిపి ప్రతి నెల 251 కోట్ల మేర ఖర్చవుతోంది. ఉమ్మడి ఆర్టీసీకి సంబంధించిన విభజన ప్రక్రియ, ముఖ్యంగా ఆస్తుల పంపకాలు జరగలేదు. సంస్థలో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి కార్పొరేషన్‌ను యథాతథంగా ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది.