తెలంగాణ

telangana

ETV Bharat / state

Diesel Burden On TSRTC: ఆర్టీసీపై డీజిల్​ భారం... సంస్థ మనుగడకే ప్రశ్నార్థకం! - Diesel burder for rtc

Diesel Burden On RTC: అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీపై డీజిల్ భారం మరింత నష్టాలను తీసుకొస్తోంది. బల్క్ బయ్యర్స్​కు ధరలు పెంచడం వల్ల ఆర్టీసీ ఆర్థికంగా మరింత చితికిపోయే అవకాశముంది. ఈ నిర్ణయంతో ఆర్టీసీ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. సంస్థపై రోజుకు రూ.42 లక్షలు.. ఏడాదికి రూ.154 కోట్ల భారం పడనుంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్​లో ఆర్టీసీ మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశముంది.

TSRTC
TSRTC

By

Published : Feb 20, 2022, 4:54 PM IST

Diesel Burden On RTC: టీఎస్ఆర్టీసీ నష్టాల కష్టాలు మరింతగా పెరిగాయి. ఈ ఏడాది వరకు ఆర్టీసీ చెల్లించాల్సిన అప్పులు రూ.5,043 కోట్లకు చేరుకుంది. ఇందులో ఉద్యోగులకు చెల్లించాల్సినవే రూ. 2,321 కోట్ల వరకు ఉన్నాయి. నష్టాలు ఏటేటా పెరుగుతున్నాయి. మరోపక్క కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఆర్టీసీపై మరింత ఆర్థిక భారం పడే విధంగా ఉంది. ప్రజల కోసమే డీజీల్, పెట్రోల్ పైన ఎక్సైజ్ డ్యూటీని రూ.10లు, రూ.5 తగ్గించామని చెప్పినప్పటికీ... డైరెక్ట్​గా కంపెనీ నుంచి కొనుగోలు చేసే వారికి లీటరుకు రూ.7 వరకు పెంచడంపై ఆర్టీసీ కార్మిక సంఘాల నుంచి విమర్శలు వెల్లువెతుత్తున్నాయి.

ఏడాదికి 290 కోట్ల డీజిల్...

ఈ నిర్ణయంపై కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం లీటర్ డీజీల్ ధర రూ.94.65 పైసలుగా ఉంది. డైరెక్ట్​గా కొనుగోలు చేసే వారికి (బల్క్ బయ్యర్స్)కు మాత్రం రూ.101.60 పైసలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అసలే ప్రభుత్వ విధనాల వల్ల ఆర్థిక సంక్షోంభంలోకి నెట్టబడ్డ ఆర్టీసీపై ఈ ధరల పెంపు తీవ్ర ప్రభావం చూపెడుతుందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీఎస్ ఆర్టీసీలో రోజుకు 6 లక్షల లీటర్ల డీజీల్​ను వినియోగిస్తారు. సంవత్సరానికి సుమారు 290 కోట్ల లీటర్ల డీజిల్ వాడతారు.

బల్క్ బయ్యర్స్​కి డీజిల్ ధరలు పెంచడం వల్ల ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ధరలు పెంచడం వల్ల ఆర్టీసీకి రోజుకి రూ.42 లక్షలు, సంవత్సరానికి రూ.154 కోట్ల భారం పడుతుందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బల్క్ బయ్యర్స్ పేరుతో పెంచిన డీజీల్ ధరలను తక్షణమే రద్దు చేయాలని ఎస్​డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు డిమాండ్ చేశారు.

ఆర్టీసీలో మార్పులు...

రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీ. 48వేల మంది ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది సేవలు అందిస్తున్నారు. టీఎస్​ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ నియమితులయ్యాకా సంస్థలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీఎస్​ఆర్టీసీని ప్రయాణికులకు మరింత చేరువ చేసే దిశగా ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. కండక్టర్లు, డ్రైవర్లను ఆ విధంగా తయారు చేస్తున్నారు. కార్గో సర్వీసులు, కాల్​సెంటర్, తదితర సేవలు ఆర్టీసీ అందిస్తోందంటూ ఆయన చెప్పుకొస్తున్నారు. ఆర్టీసీలో ప్రయాణం ప్రయాణికులకు సురక్షితమని చేరువవుతున్నారు. స్వయంగా తానే ఫీల్డ్​ లెవల్​లో సంస్థ స్థితిగతులను పరిశీలిస్తున్నారు.

ఇదీ చూడండి: TS RTC Call Center : మెరుగైన సేవల కల్పనే లక్ష్యంగా... హైటెక్​ తరహాలో ఆర్టీసీ కాల్​ సెంటర్​

ABOUT THE AUTHOR

...view details