తెలంగాణ

telangana

"డెడ్​లైన్​లకు భయపడేది లేదు... ఆర్టీసీకి అసలు బోర్డేలేదు"

By

Published : Nov 5, 2019, 3:05 PM IST

ప్రభుత్వ డెడ్‌లైన్‌లతో భయపడేది లేదని ఆర్టీసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ రాష్ట్ర ప్రభుత్వ ఇష్టప్రకారం చేసేది కాదని, కేంద్రం అనుమతి తప్పనిసరని చెప్పారు. భైంసాలో డిపో మేనేజర్‌పై దాడిని ఆయన ఖండించారు.

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి

ఎన్ని డెడ్​లైన్​లు పెట్టినా సమ్మె ఆపం: అశ్వత్థామరెడ్డి

హైకోర్టులో ఎలాంటి తీర్పు వచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రభుత్వం బెదిరించడం సరికాదని అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీలో రాష్ట్రానికి 69 శాతం, కేంద్రానికి 31 శాతం వాటా ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి మార్పులు చేయలేరని తెలిపారు. చట్టం ద్వారా కార్మికులకు రక్షణ ఉంటుందని.. ఎవరూ భయపడొద్దని అన్నారు.

ఆర్టీసీకి అసలు బోర్డేలేదు...

ఇప్పటివరకూ ఆర్టీసీలో బోర్డు లేదని, విధానపరమైన నిర్ణయానికి బోర్డు అనుమతి తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. విధుల్లో చేరిన వారు సైతం సమ్మెలోకి వచ్చేస్తున్నారని చెప్పారు. ఆర్టీసీ సమ్మె చరిత్రలో నిలిచిపోయే ఉద్యమంగా మారబోతుందని పునరుద్ఘాటించారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా 7న పెన్‌డౌన్ చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ చర్చలు జరపాలని కోరారు.

ఇదీ చదవండిః జైపాల్​రెడ్డి మృతదేహంతో కార్మికుల ఆందోళన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details