ఆగని ఆర్టీసీ బాదుడు.. సామాన్యునిపై కొనసాగుతోన్న ఛార్జీల మోత.. - ts news
14:18 April 15
ఆగని ఆర్టీసీ బాదుడు.. సామాన్యునిపై కొనసాగుతోన్న ఛార్జీల మోత..
RTC Reservation Charges: ప్రయాణికులకు ఆర్టీసీ వరస షాకులిస్తోంది. టీఎస్ఆర్టీసీ ఛార్జీలు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు. ప్రయాణికులకు ఛార్జీల పెంపును వడ్డిస్తున్న ఆర్టీసీ.. మరో భారం వేసింది. అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్ ఛార్జీలను పెంచేసింది. గతంలో రూ.20 ఉండగా మరో రూ.10 పెంచింది. ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే 30 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఇటీవలే టికెట్ ఛార్జీలను ఆర్టీసీ పెంచిన విషయం తెలిసిందే. టికెట్ తీసుకుంటున్న ప్రయాణికులు కొత్త ఛార్జీలను చూసి కంగుతింటున్నారు. ప్రయాణికులకు ఎటువంటి సమాచారం లేకుండా ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచడమేంటని ప్రశ్నిస్తున్నారు.
ఇవీ చదవండి: