ఆర్టీసీ కార్మికులెవరూ అధైర్యపడొద్దని ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. సమ్మెను అణచివేయాలని చూస్తే, కుటుంబాలతో సహా త్యాగాలకు వెనుకాడమని స్పష్టంచేశారు. ఖమ్మంలో ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డిని హైదరాబాద్ కంచన్ బాగ్‌లోని అపోలో డీఆర్డీఓ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఇతర నేతలు అపోలో ఆసత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌రెడ్డిని పరామర్శించారు. నేటి నుంచి సమ్మె మరింత ఉద్ధృతం కానుందని నేతలు తెలిపారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
'బలిదానాలొద్దు.. అవసరమైతే బలి కోరదాం'
ఖమ్మంలో ఆత్మహత్యకు యత్నించి హైదరాబాద్‌లోని అపోలో డీఆర్డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డిని ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ పరామర్శించారు. కార్మికులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సమ్మె ఉద్ధృతం చేస్తామని అశ్వత్థామరెడ్డి అన్నారు.
'బలిదానాలొద్దు.. అవసరమైతే బలి కోరదాం'
ఇవీచూడండి: నేడు ఖమ్మం జిల్లాలో బస్సుల బంద్