తెలంగాణ

telangana

By

Published : Dec 26, 2019, 3:28 PM IST

ETV Bharat / state

ఈనాడు ఎఫెక్ట్... కబ్జా భూమిని కాపాడుకున్న ఆర్టీసీ

కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్న వంద కోట్ల విలువైన భూముల్ని ఆర్టీసీ అధికారులు కాపాడారు. ఆర్టీసీకి చెందిన విలువైన భూముల్లో అక్రమణదారులు అక్రమంగా నిర్మించిన నిర్మాణాలకు కూల్చివేశారు. నిర్మాణాదారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

TSRTC 5 Acre Land encroachment in near to Shamshabad Air port
కబ్జా కోరల్లో వందల కోట్ల ఆర్టీసీ భూములు

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని రషీదుగూడలో అతి పెద్ద ఆర్టీసీ టెర్మినల్ కోసం 2017లో వందకోట్ల విలువైన 5ఎకరాల 32గుంటల భూమిని రెవెన్యూ శాఖ ఆర్టీసీకి కేటాయించింది. దీనికి అర్టీసీ అధికారులు ఆ భూముల చుట్టూ మార్కింగ్ చేసి దిమ్మెలు కూడా పాతారు. ఈ క్రమంలో కొందరు కబ్జాదారులు ఆర్టీసీకి చెందిన భూములపై కన్నెసి స్వాధీనం చేసుకోవడానికి కుట్రపన్నారు. ఈ భూముల్లో అక్రమంగా గదులు నిర్మించి అక్రమించుకున్నారు.

ఈ విషయాన్ని ఈనాడు వెలుగులోకి తీసుకొచ్చింది. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఈ స్థలం ఆర్టీసీ సంస్థకు చెందిందని ఇతరులెవరైనా నిర్మాణాలు చేపడితే చట్టపర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని స్థానిక పోలీసులకు చార్మినార్ డీజీఎం రాములు ఫిర్యాదు చేశారు.

కబ్జా కోరల్లో వందల కోట్ల ఆర్టీసీ భూములు

ఇవీ చూడండి: జనవరి 8న రవాణా బంద్​కు గోడప్రతుల ఆవిష్కరణ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details