తెలంగాణ

telangana

ETV Bharat / state

టీఆర్టీ ఎస్టీటీ తెలుగు మాధ్యమం ఫలితాలు విడుదల - sgt telugu medium results

ఎస్జీటీ తెలుగు మాధ్యమం ఫలితాలను టీఎస్​పీఎస్సీ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్​ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

టీఎస్​పీఎస్సీ

By

Published : Apr 5, 2019, 7:46 AM IST

ఉపాధ్యాయ నియామక పరీక్షలో భాగంగా ఎస్జీటీ పోస్టుల తెలుగు మాధ్యమం ఫలితాలను టీఎస్​పీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 3,786 పోస్టులకు పరీక్ష నిర్వహించగా 3,375 పోస్టులకు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్​ వెబ్​సైట్​లో పొందు పరిచినట్లు టీఎస్​పీఎస్సీ కార్యదర్శి వాణీ ప్రసాద్​ తెలిపారు.

45 విభాగాల్లో 7,485 ఉద్యోగాలు

ఇప్పటి వరకు మొత్తం 45 విభాగాల్లో 7,485 పోస్టులను భర్తీ చేసినట్లు టీఎస్​పీఎస్సీ వెల్లడించింది. వివిధ కారణాల వల్ల 411 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయలేదని కమిషన్​ తెలిపింది. దివ్యాంగుల కోటాలో 269, బీసీ-సీ, ఎస్టీ మహిళ కేటగిరీలో 73, ఏజెన్సీ ప్రాంతాల్లో 45 ఖాళీల భర్తీ పూర్తి కాలేదు.

ఎస్జీటీ ఫలితాలు విడుదల చేసిన టీఎస్​పీఎస్సీ

ఇదీ చదవండి :ఇందూరు రైతుల పిటిషన్​పై తీర్పు 8కి వాయిదా

ABOUT THE AUTHOR

...view details