గుడ్‌న్యూస్... మరో 833 ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ - 833 ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్
18:45 September 12
833 ఇంజినీరింగ్ ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్
తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో 833 ఇంజినీరింగ్ ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటనను జారీ చేసింది. అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈనెల 29 నుంచి అక్టోబర్ 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in/ సందర్శించాలని సూచించింది.
కాగా, ఇటీవల మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పోస్టులకు, రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖలో 23 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇవీ చూడండి: