తెలంగాణ

telangana

ETV Bharat / state

TSPSC appeal against Group-1 Exam cancellation : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై అప్పీలుకు వెళ్లిన టీఎస్‌పీఎస్సీ - తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష రద్దు

TSPSC appeals against Group 1 Exam
Telangana Group 1 Prelims Exam

By ETV Bharat Telangana Team

Published : Sep 25, 2023, 11:12 AM IST

Updated : Sep 25, 2023, 12:53 PM IST

11:08 September 25

TSPSC appeal against Group 1 Exam cancellation గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై అప్పీలుకు వెళ్లిన టీఎస్‌పీఎస్సీ

TSPSC appeal against Group-1 Exam cancellation : తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండోసారి కూడా పరీక్షను రద్దు కావడంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైకోర్టుకు అప్పీలుకు వెళ్లింది. అత్యవసర విచారణకు లంచ్ మోషన్ అనుమతి కోరింది. అయితే ఈ అప్పీల్‌పై స్పందించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. మంగళవారం విచారణ జరిపేందుకు అంగీకరించింది. గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ ఈ నెల 23వ తేదీన ఉన్నత న్యాయస్థానం సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

TSPSC on Group 1 Prelims Cancellation : అయితే ఇప్పటికే పేపర్ లీకేజీ వల్లగ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఓసారి రద్దయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి రద్దవ్వడంతో అభ్యర్థులతో పాటు కమిషన్‌లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. మరోసారి ప్రిలిమ్స్ రాయాలంటే లక్షల మంది అభ్యర్థులు మానసికంగా ఇబ్బందులకు గురవుతారని.. కొన్నిసార్లు ఇదంతా భరించలేక ఆత్మహత్యలే శరణ్యమని భావించే ప్రమాదం కూడా ఉందని కమిషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై డివిజన్‌ బెంచ్‌కు అప్పీలుకు వెళ్లినట్లు కమిషన్ అధికారులు తెలిపారు. మరోవైపు గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుతో అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు. ఇప్పటికే రెండుసార్లు పరీక్ష రాశామని, మూడోసారి రాయడమంటే చాలా వ్యయప్రయాసలు ఎదుర్కోవాల్సి వస్తుందని. అదంతా మళ్లీ తట్టుకునే శక్తి తమకు లేదని అభ్యర్థులు భయపడుతున్నారు.

Telangana Group1 Prelims Final Key : గ్రూప్-1 ప్రిలిమ్స్ తుది కీ విడుదల

Telangana Group 1 Prelims Cancellation 2023 :ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారి 2011లో గ్రూప్‌-1 ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 11 ఏళ్ల అనంతరం.. గతేడాది మార్చిలో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. సీఎం ప్రకటనతో అభ్యర్థులంతా ఫుల్ ఖుష్ అయ్యారు. 2022 ఏప్రిల్‌ 26వ తేదీన 503 పోస్టులతో తెలంగాణలో తొలి గ్రూప్‌-1 ప్రకటనను టీఎస్‌పీఎస్సీ విడుదల చేయడంతో ఇక అభ్యర్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

ఇక నోటిఫికేషన్ రాగానే రాష్ట్రవ్యాప్తంగా 3,80,202 మంది దరఖాస్తు చేసుకోగా... అదే ఏడాది అక్టోబరు 16వ తేదీన ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించింది టీఎస్పీఎస్సీ. ఈ పరీక్షకు 2,85,916 మంది హాజరవ్వగా.. 1:50 నిష్పత్తిలో 25 వేల మందిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు ఈ ఏడాది జనవరిలో మెయిన్స్‌కు ఎంపిక చేశారు. జూన్‌లో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూలు కూడా విడుదల చేశారు.

TSPSC Paper Leak Scam 2023 : అంతా సవ్యంగా జరుగుతున్న క్రమంలో అనూహ్యంగా గ్రూప్-1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల లీకేజీ స్కామ్వెలుగులోకి వచ్చి ప్రకంపనలు సృష్టించింది. దీంతో కమిషన్ ఈ పరీక్షను రద్దు చేసి జూన్11వ తేదీన మళ్లీ ప్రిలిమ్స్ నిర్వహించింది. ఈ పరీక్షకు 2,33,506 మంది అభ్యర్థులు హాజరవ్వగా.. తొలిసారితో పోలిస్తే రెండోసారి ఏకంగా 52 వేల మంది పరీక్షకు డుమ్మా కొట్టారు. ఒకసారి ఎంతో కష్టపడి పరీక్ష రాసి పేపర్ లీకేజీ కావడం.. ఆ తర్వాత పరీక్ష రద్దు కావడంతో అభ్యర్థులు మానసికంగా కుంగిపోయారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందుకే చాలా మంది మళ్లీ పరీక్ష రాయలేదు. అయితే ఇప్పుడు అది కూడా రద్దవ్వడంతో అభ్యర్థులు మానసికంగా మరింత కుంగిపోయే అవకాశముందని కమిషన్ అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో అప్పీలుకు వెళ్లింది.

TSPSC Group 1 Results 2023 : ఫలితాలను వెల్లడించేలా టీఎస్‌పీఎస్సీ కసరత్తు.. ప్రత్యేక ప్రణాళిక షురూ

Group 1 Prelims Exam Cancelled Telangana : 'గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో TSPSC అజాగ్రత్తగా ఉంది.. ప్రిలిమ్స్‌ను రద్దు చేసి మళ్లీ నిర్వహించండి'

Last Updated : Sep 25, 2023, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details