తెలంగాణ ఆర్టీసీ ఎండీగా (ts rtc md) బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్.. సిబ్బంది, అధికారులతో ఆన్లైనలో సమావేశం నిర్వహించారు (rtc md sajjanar review ). కొవిడ్ సమయంలో అత్యంత సేవాభావంతో ధైర్యంగా, ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా విధులు నిర్వర్తించిన సిబ్బందిని, ఉద్యోగులను ఎండీ అభినందించారు. కరోనా సమయంలో ప్రయాణికులను, అత్యవసర సేవల సిబ్బందిని, వలస కార్మికులకు రవాణా సౌకర్యం అందించినందుకు ఆర్టీసీ సిబ్బందిని ఆయన ప్రశంసించారు. వ్యవసాయోత్పత్తులను కార్గో బస్సుల ద్వారా చౌకగా మార్కెట్ యార్డుకు తరలించి అన్నదాతకు చేయూత నిచ్చినందుకు అభినందించారు. గడిచిన దసరా, పెళ్లిళ్ల సీజన్లో గణనీయమైన ఆదాయాన్ని ఆర్జించామని ప్రకటించారు.
చర్చకొచ్చిన పలు కీలక అంశాలు
సంస్థ పట్ల సిబ్బంది, ఉద్యోగుల బాధ్యతను గుర్తు చేశారు. సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేపట్టిన తీసుకున్న నిర్ణయాలను వివరించారు. సిబ్బందికి ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు చెల్లింపు, దీర్ఘకాలికంగా చెల్లించవలసిన పీఎఫ్, సీ సీఎస్, ఎస్ఆర్బీఎస్, ఈడీఎల్ఐఎఫ్కి విడతల వారీగా నిధుల కేటాయింపుపై చర్చించారు.