బస్ బుక్ చేసుకోండి...బహమతులు అందుకోండి అంటోంది ఆర్టీసీ. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఆర్టీసీ సంస్థ సద్వినియోగం చేసుకుంటుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో... పెళ్లి కోసం బస్సులు బుక్ చేసుకున్న వారి వివాహ వేడుకకు ఆర్టీసీ తరఫున ఒకరు వెళ్లి నూతన జంటను ఆశీర్వదించి...ఆర్టీసీ తరఫున బహుమతిని అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు (ts rtc wedding gift for who book a rtc bus for their marriage ceremonies) . ఆర్టీసీఎండీ సజ్జనార్ (md sajjanar) సైతం ఓ వివాహ వేడుకకు హాజరై... కానుక ఇచ్చారు. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.
ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు
రాష్ట్రంలో ఆర్టీసీకి ఎల్లప్పడూ మంచి ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలో ప్రజలకు మరింత చేరువ చేయటానికి అనేక సరికొత్త ఆలోచనలతో దూసుకెళ్తున్నారు. దసరా పండుగ సందర్బంగా గతంలో ప్రత్యేక బస్సులు నడిపి... అందుకు అధిక ఛార్జీలు వసూలు చేసేవారు. కానీ, ఈ ఏడాది సాధారణ ఛార్జీలు తీసుకుని ప్రయాణికులను సురక్షితంగా ఇళ్లకు చేర్చారు. దీంతో ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తంచేశారు. రానున్న సమ్మక్క-సారాలమ్మ జాతరకు సైతం సాధారణ చార్జీలను వసూలు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ విధంగా ప్రయాణికులకు అనువైన నిర్ణయాలు తీసుకుంటూ మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది.
ఇదీ చూడండి:Sajjanar traveled in tsrtc bus: మరోసారి... ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సజ్జనార్