తెలంగాణ

telangana

పబ్‌ల అంశంపై హైకోర్టు విచారణ.. పోలీసులకు కీలక ఆదేశాలు

By

Published : Sep 12, 2022, 5:29 PM IST

Updated : Sep 12, 2022, 6:16 PM IST

TS High Court hearing on the issue of pubs in the middle of the population in Hyderabad
పబ్‌ల అంశంపై హైకోర్టు విచారణ.. జీహెచ్‌ఎంసీకి కీలక ఆదేశాలు

17:27 September 12

పబ్‌ల అంశంపై హైకోర్టు విచారణ

హైదరాబాద్‌లో జనావాసాల మధ్య పబ్‌ల నిర్వహణ అంశంపై హైకోర్టు ఇవాళ విచారించింది. ధ్వని నిబంధన ఉల్లంఘించిన పబ్‌లపై నమోదైన కేసుల గురించి ఆరా తీసింది. ఇప్పటివరకు ఎన్ని కేసులు పెట్టారో చెప్పాలని పోలీసులను ఆదేశించింది. నివేదిక సమర్పించాలంటూ హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ నగర పోలీస్‌ కమిషనర్లను ఆదేశించింది. పబ్‌లలో మ్యూజిక్‌, డ్యాన్సులకు అనుమతుల గురించి తెలపాలని సూచించింది. పబ్‌లకు లైసెన్స్‌ మంజూరు చేసేటప్పుడు పరిగణించిన అంశాలేంటో తెలపాలని జీహెచ్‌ఎంసీకి ఆదేశించింది. ఈ వ్యవహారంపై గత కొంత కాలంగా హైకోర్టులో విచారణ జరుగుతోంది.

జూబ్లీహిల్స్‌ రెసిడెంట్స్‌ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ అసోసియేషన్‌ వేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. అయితే, డీజే సౌండ్‌లు, మితిమీరిన సౌండ్‌తో నృత్యాల వల్ల చుట్టుపక్కలవాళ్లకు ఇబ్బందులు కలుగుతున్నాయని.. గతంలో అనేక సందర్భాల్లో స్థానిక పోలీసుల నుంచి డీజీపీ, ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు చేసినా ఎవరూ స్పందించడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం దీనిపై వివరాలు కోరుతూ నోటీసులు జారీచేసింది.

ఇవీ చూడండి:

Last Updated : Sep 12, 2022, 6:16 PM IST

ABOUT THE AUTHOR

...view details