తెలంగాణ

telangana

By

Published : Jul 14, 2020, 4:52 AM IST

ETV Bharat / state

వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఛాతీ ఆస్పత్రి ఘటన: హైకోర్టు

హైదరాబాద్​ ఛాతీ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్లనే రవికుమార్​ అనే యువకుడు మృతిచెందాడని హైకోర్టు వ్యాఖ్యానించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవల్సిందేనని స్పష్టం చేసింది. ఈనెల 20 లోగా సమర్పించాలని ఆదేశించింది.

ts hc
వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఛాతీ ఆస్పత్రి ఘటన: హైకోర్టు

హైదరాబాద్​ ఛాతీ ఆస్పత్రిలో ఇటీవల వైద్యం అందక ఓ యువకుడు మృతిచెందిన ఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితుడు రవికుమార్ వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తప్ప కరోనాతో చనిపోలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తప్పుచేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని.. కేసులు నమోదుచేసి అభియోగపత్రాలు దాఖలుచేయాలని స్పష్టంచేసింది.

రవికుమార్ మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని.. బాధితుడి కుటుంబానికి పరిహారం ఇప్పించాలని కోరుతూ బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్గం యశ్​పాల్ గౌడ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సోమవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. సకాలంలో వైద్యం అందకపోవడం వల్లనే రవికుమార్ మృతి చెందారని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రియాంక చౌదరి వాదించారు. రవికుమార్ మృతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయ్​నేన్ రెడ్డిల ధర్మాసనం ఆదేశించింది. నివేదిక నిజాయితీగా ఉండాలని.. బాధ్యులను రక్షించే ప్రయత్నం చేయవద్దని స్పష్టం చేసింది.

ఘటనకు బాధ్యులు ఏ హోదాలో ఉన్నా.. స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈనెల 20 లోగా సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను 21కి వాయిదా వేసింది.

ఇవీచూడండి:ఊపిరాడ్తలేదు డాడీ.. సెల్ఫీ వీడియోలో కరోనా బాధితుడి ఆర్తనాదం

ABOUT THE AUTHOR

...view details