Ts government debt: రాష్ట్ర ప్రభుత్వం మరో వెయ్యి కోట్ల రూపాయలు రుణాల ద్వారా సమకూర్చుకోనుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంకు ద్వారా విక్రయం కోసం బాండ్లను జారీ చేసింది. 500 కోట్ల విలువైన బాండ్లను 23 ఏళ్ల కాలానికి, మరో 500 కోట్ల విలువైన బాండ్లను 24 ఏళ్ల కాలానికి జారీ చేసింది. ఈ బాండ్లను ఆర్బీఐ వచ్చే మంగళవారం వేలం వేయనుంది. గత వారం వెయ్యి కోట్లను రుణాల ద్వారా సమీకరించుకున్న రాష్ట్ర ప్రభుత్వం... తాజాగా మరో వెయ్యి కోట్ల విలువైన బాండ్లు జారీ చేసింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రుణాల మొత్తం 16,500 కోట్ల రూపాయలు అవుతుంది.
ఇవీ చూడండి..