తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంసెట్​ దరఖాస్తు గడువు పొడిగింపు - ts eamcet 2021 latest news

ఎంసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును రాష్ట్ర ఉన్నత విద్యమండలి పొడిగించింది. ఆలస్య రుసుం లేకుండా ఈనెల 26 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలంగాణ ఎంసెట్‌ కన్వీనర్‌ ఎ.గోవర్దన్‌ వెల్లడించారు.

eamcet
eamcet

By

Published : May 17, 2021, 9:59 PM IST

ఎంసెట్​ ఆన్​లైన్​ దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 26 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని తెలంగాణ ఎంసెట్‌ కన్వీనర్‌ ఆచార్య ఎ.గోవర్దన్‌ ​ తెలిపారు. నేటి వరకు లక్ష 56 వేల 526 మంది దరఖాస్తు చేసినట్లు కన్వీనర్​ వెల్లడించారు.

ఇంజినీరింగ్​కు లక్ష 6వేల 506, వ్యవసాయ, ఫార్మా కోర్సుల కోసం 50 వేల 20మంది దరఖాస్తు చేసుకున్నారు. కరోనా తీవ్రత కారణంగా అన్ని ప్రవేశ పరీక్షలకు 20 రోజుల ముందు వరకు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తులు స్వీకరించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది.

ఇదీ చదవండి:రాగల రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు

ABOUT THE AUTHOR

...view details