Telangana Assembly Meetings in Monsoon Sessions: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశమైంది. ఉపసభాపతి పద్మారావు గౌడ్, మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మజ్లిస్, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతలు అక్బరుద్దీన్ ఓవైసీ, భట్టి విక్రమార్క సమావేశంలో పాల్గొన్నారు. మూడు, నాలుగు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
Bhatti Vikramarka Respond in Assembly Sessions: రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని, అన్నింటినీ చర్చించేందుకు వీలుగా అసెంబ్లీ సమావేశాలు 20 రోజుల పాటు నిర్వహించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. దేశంలోనే అతి తక్కువ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని విమర్శించారు. దీనికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు. ఎన్ని రోజులు నిర్వహించారన్నది ముఖ్యం కాదని.. ఎన్ని గంటల పాటు సమావేశమైంది, ఎంత మంచి చర్చ జరిగిందన్నది ముఖ్యమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రతిపక్ష నేతల మానసిక స్థితి దెబ్బతిన్నదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో చర్చ సజావుగా సాగేలా చూడాలని అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో ఇండియా కూటమి పేరిట చర్చ జరగనివ్వలేదని పేర్కొన్నారు.
Telangana Assembly Sessions 2023 : 3 రోజులే అసెంబ్లీ సమావేశాలు.. 10 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం!