తెలంగాణ

telangana

ETV Bharat / state

"సీఎం పరిశీలనలో... ఐఆర్, ఫిట్​మెంట్ అంశం" - ts_assembly_session

రాష్ట్రంలో మెరుగైన పాలన అందించే లక్ష్యంతో చేపట్టిన పురపాలక చట్టానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ అందరికి మార్గదర్శకమని స్పష్టం చేశారు కేటీఆర్. ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ దృష్టిలో ఉందని.. ఐఆర్, ఫిట్​మెంట్ అంశాన్ని సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. సభలో ఇవాళ ఆర్థిక, నిర్వహణ, ప్రణాళిక, సర్వే, గణాంకాల శాఖల పద్దులపై చర్చ జరిగింది.

"సీఎం పరిశీలనలో... ఐఆర్, ఫిట్​మెంట్ అంశం"

By

Published : Sep 21, 2019, 8:19 PM IST

తెలంగాణ ప్రజలకు మెరుగైన పాలన అందించే లక్ష్యంతో పురపాలక చట్టాన్ని రూపొందించినట్లు మంత్రి కేటీఆర్​ తెలిపారు. ఈ మేరకు సభలో బిల్లును మంత్రి ప్రవేశపెట్టారు. జులై 2019లో ప్రవేశపెట్టిన బిల్లుకు ఐదు సవరణలు చేయగా.. ఎలాంటి చర్చ లేకుండా పురపాలక చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది.

ఎక్కువ మొత్తంలో పింఛన్​ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ

దేశంలోనే మొదటిసారిగా వృద్ధులకు ఎక్కువ మొత్తంలో పింఛన్​ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని పంచాయతీరాజ్​ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ తెలిపారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. భాజపా ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో అతితక్కువ పింఛన్​ ఇస్తూ ప్రజల వద్ద గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.

42 శాతం ఫిట్​మెంట్ అడిగితే 43 శాతం ఇచ్చాం

ఉద్యోగుల ఐఆర్, ఫిట్​మెంట్ అంశాన్ని సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. గతంలో 42 శాతం ఫిట్​మెంట్ అడిగితే 43 శాతం ఇచ్చినట్లు గుర్తు చేశారు. కార్పొరేటు ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందించేందుకు ప్రత్యేక హెల్త్ పాలసీ తీసుకువచ్చినట్లు వెల్లడించారు.

ఆర్థిక, నిర్వహణ, ప్రణాళిక పద్దులపై చర్చ

అనంతరం ఆర్థిక, నిర్వహణ, ప్రణాళిక, సర్వే, గణాంకాల శాఖల పద్దులపై చర్చ జరుగుతుండగా శ్రీధర్​బాబు పలు అంశాలను లేవనెత్తారు. దీనికి కేటీఆర్​ సమాధానమిస్తూ అభివృద్ధికి మారుపేరు ఒకప్పుడు గుజరాత్​ను దేశానికి ఆదర్శంగా చెప్పేవాళ్లు కానీ... ప్రస్తుతం మన రాష్ట్రంను చూపిస్తున్నారని తెలిపారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని.. ఇక్కడి సంక్షేమ పధకాలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

పేదలు, బలహీన వర్గాలవారికి తక్షణమే న్యాయసాయం

సమాచార - పౌరసంబంధాలు, శాసనవ్యవస్థ, న్యాయపాలన పద్దులపై జరిగిన చర్చలో మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు. సుప్రీంకోర్టు, కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఎన్నోమార్లు విజ్ఞప్తి చేస్తే హైకోర్టు ఏర్పాటయిందని వెల్లడించారు. కోర్టులో పేరుకుపోతున్న కేసులను సత్వరం పరిష్కరించేందుకు లోక్​ అదాలత్​ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా పేదలు, బలహీన వర్గాలవారికి తక్షణ న్యాయసాయం అందుతుందని స్పష్టం చేశారు. అనంతరం స్పీకర్​ శాసనసభను రేపటికి వాయిదా వేశారు.

"సీఎం పరిశీలనలో... ఐఆర్, ఫిట్​మెంట్ అంశం"

ఇవీచూడండి: మద్యం దుకాణాల లైసెన్సుల గడువు పెంపు!

ABOUT THE AUTHOR

...view details