తెలంగాణ

telangana

ETV Bharat / state

Ts assembly Live updates: విభజన చట్టంలోని గిరిజన విశ్వవిద్యాలయం ఏమైంది?: భట్టి - undefined

LIVE UPDATES
LIVE UPDATES

By

Published : Sep 13, 2022, 10:04 AM IST

Updated : Sep 13, 2022, 4:54 PM IST

16:53 September 13

కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీకి రాష్ట్రం స్థలం కూడా కేటాయించింది: ఎర్రబెల్లి

  • కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీకి రాష్ట్రం స్థలం కూడా కేటాయించింది: ఎర్రబెల్లి
  • గిరిజన వర్సిటీకి రాష్ట్రం ఐదేళ్ల క్రితం భూమి కేటాయించింది: ఎర్రబెల్లి
  • భాజపా, కాంగ్రెస్‌ ఎంపీలు కేంద్రాన్ని ఒక్కసారైనా అడిగారా?: ఎర్రబెల్లి
  • కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీలను కేంద్రం ఇతర రాష్ట్రాలకు ఇచ్చింది: ఎర్రబెల్లి

16:52 September 13

విభజన చట్టంలోని గిరిజన విశ్వవిద్యాలయం ఏమైంది?: భట్టి

  • విభజన చట్టంలోని గిరిజన విశ్వవిద్యాలయం ఏమైంది?: భట్టి
  • బయ్యారానికి ఉక్కు పరిశ్రమ వచ్చిందా?: భట్టి విక్రమార్క
  • విభజన చట్టం హామీలు అమలుచేయకుంటే ఏం చేస్తున్నారు?: భట్టి
  • బయ్యారం ఉక్కు పరిశ్రమను ఎలాగైనా సాధించుకోవాలి: భట్టి
  • విభజన చట్టం హామీల సాధనలో తెరాస ప్రభుత్వం విఫలం: భట్టి

15:51 September 13

  • ముషీరాబాద్ అజామాబాద్‌లో 136 ఎకరాల్లో వివిధ పరిశ్రమలు: కేటీఆర్‌
  • అజామాబాద్‌లో ప్రస్తుతం 58 కంపెనీలు ఉన్నాయి: కేటీఆర్‌
  • 30 ఏళ్లు లీజ్‌కు ఇస్తూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం: కేటీఆర్‌
  • 36 మంది వ్యాపారం చేస్తున్నారు.. 22 మంది సబ్ లీజ్‌కు ఇచ్చారు: కేటీఆర్‌
  • రామ్‌నగర్‌లో ఆధునిక ఫిష్ మార్కెట్ నిర్మించాలని నిర్ణయం: కేటీఆర్‌
  • ప్రజోపయోగ పనులు చేయాలని నిర్ణయించాం: మంత్రి కేటీఆర్‌
  • పరిశ్రమకు ఇచ్చిన స్థలాలను ఇతర అవసరాలకు వాడటం లేదు: కేటీఆర్‌
  • కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయి: కేటీఆర్‌
  • స్టూడియోల పేరుతో ఇతర నిర్మాణాలు చేపట్టారు: కేటీఆర్‌
  • మేం పరిశ్రమలకు ఇచ్చిన స్థలాల్లో ఎక్కడా అక్రమాలు లేవు: కేటీఆర్‌
  • ఇప్పటివరకు 1,234 ఎకరాలు స్వాధీనం చేసుకున్నాం: మంత్రి కేటీఆర్‌
  • అజామాబాద్‌లో 9 ప్రభుత్వరంగ సంస్థలు ఉన్నాయి: కేటీఆర్‌
  • 2003లో జీవో 20 ద్వారా కాలుష్య పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ బయటకు పంపాలని ఆదేశాలు
  • అజామాబాద్ భూములను వాణిజ్య అవసరాలకూ వాడుకుంటాం: కేటీఆర్‌

15:26 September 13

విభజన చట్టం హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై సభలో చర్చ

  • ఎఫ్‌ఆర్‌బీఎం రుణపరిమితిలో కేంద్ర ద్వంద్వ విధానాలపై అసెంబ్లీలో చర్చ
  • కేంద్ర ద్వంద్వ విధానాల వల్ల రాష్ట్ర ప్రగతిపై పడిన ప్రభావంపై చర్చ
  • విభజన చట్టం హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై సభలో చర్చ

15:26 September 13

  • అజామాబాద్‌లో 9 ప్రభుత్వ యూనిట్లు కూడా ఉన్నాయి: కేటీఆర్‌
  • కాలుష్య పరిశ్రమలను తరలించాలనేదే జీవో 20 సారాంశం: కేటీఆర్‌
  • ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నాకే కాలుష్య పరిశ్రమలు తరలించాలి
  • ఇప్పటికే 58 మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారు
  • పారిశ్రామికవాడలు తరలించడం అనుకున్నంత సులువు కాదు
  • భూమి వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని పరిశ్రమలు కోరుతున్నాయి
  • 1,234 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నాం

15:25 September 13

  • కేంద్రప్రభుత్వం వల్ల దేశంలో ఎవరు బాగుపడ్డారో చెప్పాలి?: హరీశ్‌
  • వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన రూ.1,350 కోట్లు పెండింగ్ పెట్టారు: హరీశ్‌
  • వ్యాట్ ఉంటే రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వచ్చేది: హరీశ్‌రావు
  • జీఎస్‌టీ వల్ల తెలంగాణకు నష్టమే ఎక్కువ: హరీశ్‌రావు
  • రాష్ట్ర అప్పుల్లో కలిపి జీఎస్‌టీ పరిహారం ఇచ్చారు: హరీశ్‌రావు
  • ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచుకునే మార్గాలు చూస్తున్నాం: హరీశ్‌
  • కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టినా అభివృద్ధిలో ముందుకెళ్తున్నాం: హరీశ్‌
  • బాధ్యతగానే అప్పులు చేస్తున్నాం.. ఎక్కడా నిర్లక్ష్యం లేదు..: హరీశ్‌
  • సకలజనుల లబ్ధి కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది: హరీశ్‌రావు

15:05 September 13

  • బడ్జెట్‌లో మీరు ఆశించిన 40 శాతం ఆదాయం రాదు: భట్టి
  • జీతాలు, ఖర్చులకే మీ బడ్జెట్‌ సరిపోవచ్చు: భట్టి విక్రమార్క
  • ఎఫ్‌ఆర్‌బీఎం కోతలతో ఏ రంగాలపై భారం పడుతుందో చెప్పాలి?: భట్టి
  • రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపైనా రూ.2.25 లక్షల అప్పు ఉంది: భట్టి
  • రాష్ట్ర ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ ఉండాలి: భట్టి
  • ఎఫ్‌ఆర్‌బీఎం రుణపరిమితి దాటడం వల్లే కోతలు పెట్టారు: భట్టి

15:04 September 13

  • రాష్ట్ర ప్రజలమీద రూ.1.50 లక్షల అప్పు ఉందని ప్రతిపక్షాలు అంటున్నారు
  • ఈ దేశంలో ఉండే ప్రతీ పౌరుడి మీద రూ.1,25,679 అప్పు ఉంది
  • వాస్తవానికి తెలంగాణ అప్పులు రూ.3,29,980 కోట్లు
  • దీని ప్రకారం రాష్ట్ర తలసరి అప్పు రూ.94,272
  • కేంద్ర ప్రభుత్వం చేసి అప్పులు కూడా ఇందులో కలుపుతున్నారు
  • రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1 దేశాన్ని రాష్ట్రాల సమాఖ్యగా చెప్పింది
  • బలమైన కేంద్రం.. బలహీన రాష్ట్రం అనే సిద్ధాంతాన్ని భాజపా అమలు చేస్తోంది
  • సఫలం, సంక్షేమం, సామరస్యం అనేవి తెలంగాణలో తెరాస పరిపాల తీరు
  • విఫలం, విషం, విద్వేశం అనేది భాజపా పరిపాలన తీరు
  • దేశ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది
  • కేంద్రప్రభుత్వం పరిపాలనలో అన్ని ధరలు పెరిగాయి

15:04 September 13

  • సీఎం, కేటీఆర్‌ మీద మాకు నమ్మకముంది
  • వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు
  • 20వ తేదీన ఉమ్మడి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు
  • అప్పటి వరకు మా ఆందోళన శాంతియుతంగా కొనసాగిస్తాం
  • మాకు ఎలాంటి రాజకీయ మద్దతు లేదు
  • జేఎసీ తరఫున మా సమస్యలపై కేటీఆర్‌ చర్చించారు
  • గతంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నారు
  • 50 ఏళ్లు పైబడిన వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు
  • అర్హలైన వీఆర్‌ఏలకు పదోన్నతులు ఇస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు
  • మేము శాంతియుతంగా ఉద్యమం నడిపిస్తున్నాం
  • ఈనెల 20 వరకు శాంతియుతంగా నిరసనను కొనసాగిస్తాము
  • మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం
  • దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు
  • ప్రభుత్వం ఉన్నతాధికారి కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది
  • సమ్మె తాత్కాలికంగా వాయిదా వేయాలని కేటీఆర్ కోరారు
  • రేపట్నుంచి చర్చల వరకు శాంతియుతంగా నిరసన కొనసాగిస్తాం
  • మాకు ప్రభుత్వంపై నమ్మకం ఉంది
  • 23వేల మంది వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలి

15:02 September 13

  • వీఆర్ఏల ప్రతినిధులతో ముగిసిన మంత్రి కేటీఆర్ సమావేశం
  • వీఆర్ఏల ప్రతినిధులతో శాసనసభ ప్రాంగణంలో చర్చలు
  • వీఆర్ఏల సమస్యలు, డిమాండ్లపై మంత్రి కేటీఆర్ చర్చలు
  • వీఆర్ఏలకు పే స్కేల్‌, పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్‌
  • వయసు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరిన వీఆర్ఏలు
  • ఈనెల 20 న వీఆర్ఏలతో చర్చలు జరుపుతామన్న కేటీఆర్‌
  • వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామన్న మంత్రి కేటీఆర్‌
  • వీఆర్‌ఏలు ఆందోళన విరమించాలన్న మంత్రి కేటీఆర్
  • ఇందిరాపార్కులో ఉన్న ఇతర ప్రతినిధులతో చర్చిస్తామన్న వీఆర్ఏ ప్రతినిధులు
  • వీఆర్ఏలకు పే స్కేల్‌, పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్‌
  • వయసు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరిన వీఆర్ఏలు

14:05 September 13

అసెంబ్లీ ముట్టడికి వచ్చిన టీపీటీఎఫ్‌ నాయకులు అరెస్టు

అసెంబ్లీ ముట్టడికి వచ్చిన టీపీటీఎఫ్‌ నాయకులు అరెస్టు

టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాతూరి మహేందర్‌రెడ్డి అరెస్టు

సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రవీందర్ అరెస్టు

సిరిసిల్ల నుంచి వచ్చిన టీపీటీఎఫ్‌ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు

14:05 September 13

రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నారు : హరీశ్ రావు

ఎఫ్‌ఆర్‌బీఎం రుణపరిమితి పేరుతో రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నారు : హరీశ్ రావు

రాష్ట్రాలను సంప్రదించకుండా కోతలు ఎలా విధిస్తారు?: హరీశ్ రావు

తెలంగాణకు నిధులు ఇవ్వమని 15వ ఆర్థిక సంఘం చెప్పింది: హరీశ్ రావు

తెలంగాణకు రూ.6,268 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం చెప్పింది: హరీశ్ రావు

రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం ఆపింది: హరీశ్ రావు

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వాలని నీతిఆయోగ్ చెప్పింది: హరీశ్ రావు

నీతిఆయోగ్ చెప్పినా రాష్ట్రానికి రూపాయి ఇవ్వలేదు: హరీశ్ రావు

రాష్ట్రాల వాటా 42 శాతానికి పెంచామని కేంద్రం చెబుతోంది: హరీశ్ రావు

కేంద్రం దొడ్డిదారిన సెస్సుల రూపంలో పన్నులు పెంచారు: హరీశ్ రావు

సెస్సుల రూపంలో వచ్చిన డబ్బును రాష్ట్రాలకు పంచరు: హరీశ్ రావు

రాష్ట్రానికి వాస్తవానికి వచ్చిన వాటా 29.6 శాతం మాత్రమే: హరీశ్ రావు

మన రాష్ట్రానికి రూ.33,712 కోట్ల నష్టం జరిగింది: హరీశ్ రావు

13:47 September 13

అసెంబ్లీ ముట్టడికి వచ్చిన టీపీటీఎఫ్‌ నాయకులు అరెస్టు

అసెంబ్లీ ముట్టడికి వచ్చిన టీపీటీఎఫ్‌ నాయకులు అరెస్టు

టీపీటీఎఫ్‌ ఉపాధ్యక్షుడు పాతూరి మహేందర్‌రెడ్డి అరెస్టు

సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రవీందర్ అరెస్టు

సిరిసిల్ల నుంచి వచ్చిన టీపీటీఎఫ్‌ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు

13:46 September 13

వీఆర్ఏల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశం

వీఆర్ఏల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశం

వీఆర్ఏల ప్రతినిధులతో శాసనసభ ప్రాంగణంలో చర్చలు

వీఆర్ఏల సమస్యలు, డిమాండ్లపై మంత్రి కేటీఆర్ చర్చలు

13:35 September 13

వీఆర్‌ఏలను తెలుగుతల్లి వంతెన కింద అడ్డుకున్న పోలీసులు

  • వీఆర్‌ఏలను తెలుగుతల్లి వంతెన కింద అడ్డుకున్న పోలీసులు
  • లాఠీఛార్జి చేసి అసెంబ్లీ వైపు వచ్చే వీఆర్‌ఏలను చెదరగొట్టిన పోలీసులు
  • అసెంబ్లీ ముట్టడికి ఉపాధ్యాయుల ప్రయత్నం
  • నారాయణగూడ పైవంతెన నుంచి అసెంబ్లీ ముట్టడికి రాక
  • టీచర్లను హిమాయత్‌నగర్‌లో అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు

13:17 September 13

ఇవాళ 8 బిల్లులకు శాసనసభ ఆమోదం

  • ఇవాళ 8 బిల్లులకు శాసనసభ ఆమోదం

13:16 September 13

  • అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన వివిధ సంఘాలు
  • అసెంబ్లీ ముట్టడికి వీఆర్‌ఏలు, రెడ్డి సంఘాలు, ఉపాధ్యాయుల ప్రయత్నం
  • అసెంబ్లీ ముట్టడికి మత్స్యకారులు, కాంగ్రెస్ శ్రేణుల ప్రయత్నం
  • శాసనసభ పరిసరాల్లో ఉద్రిక్తత, పోలీసుల మోహరింపు
  • ఆందోళనకారులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి స్టేషన్లకు తరలింపు
  • అసెంబ్లీ ముట్టడికి వచ్చిన ఉపాధ్యాయులు, సంఘాల నేతలు
  • 317 జీవో రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌
  • బదిలీలు, పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌
  • రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్
  • రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు డిమాండ్‌పై అసెంబ్లీ ముట్టడికి యత్నం
  • తమ సమస్యలు పరిష్కరించాలని వీఆర్‌ఏల ఆందోళన
  • ఇందిరా పార్కు నుంచి అసెంబ్లీ ముట్టడికి వచ్చిన వీఆర్‌ఏలు
  • మత్స్యకారుల సమస్యలపై అసెంబ్లీ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు
  • అసెంబ్లీ ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు
  • మత్స్యకారుల టెండర్లను ఏపీ వారికి ఇస్తున్నారని ఆందోళన
  • తెలంగాణ మత్స్యకారులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆందోళన

12:48 September 13

  • అసెంబ్లీ ముట్టడికి యత్నించిన వివిధ సంఘాలు
  • రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నం
  • తమ సమస్యలు పరిష్కరించాలని వీఆర్‌ఏల ఆందోళన
  • ఇందిరా పార్కు నుంచి అసెంబ్లీ ముట్టడికి వచ్చిన వీఆర్‌ఏలు
  • అసెంబ్లీ ముట్టడి ప్రయత్నంతో ఉద్రిక్తత

12:48 September 13

  • మోటార్ వెహికల్‌ పన్నుల చట్ట సవరణ బిల్లుపై చర్చ
  • వాహనాల విక్రయంలో ప్రభుత్వానికి పన్నులు సరిగా వస్తాయి: అజయ్‌
  • పన్నులు ఎగ్గొట్టకుండా ఉండేందుకే సవరణ బిల్లు: అజయ్‌
  • డీలర్ల రాయితీ నిలువరించేందుకే పన్నుల చట్ట సవరణ బిల్లు: అజయ్‌
  • లారీల అంతర్‌రాష్ట్ర పన్నులపై ఏపీ అధికారులతో మాట్లాడుతున్నాం: అజయ్‌
  • గ్రీన్‌ ట్యాక్స్‌ అనేది కేంద్రప్రభుత్వం తెచ్చింది: మంత్రి అజయ్‌
  • చట్ట సవరణ వల్ల వినియోగదారులకు పెద్దగా ఇబ్బంది ఉండదు: అజయ్‌

12:48 September 13

  • విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లుకు శాసనసభ ఆమోదం

12:48 September 13

  • 12 వర్సిటీలకు ఉమ్మడి నియామక బోర్డు ఏర్పాటు చాలా మంచిది: సబిత
  • నియామకాల తర్వాత కూడా కోర్టు కేసులు వస్తున్నాయి: సబిత
  • కోర్టు తీర్పుల వల్ల కొన్ని వర్సిటీల్లో ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది: సబిత
  • యూజీసీ నిబంధనల మేరకే ఉమ్మడి నియామక బోర్డు: సబిత
  • ఉమ్మడి నియామక బోర్డు ఛైర్మన్‌గా ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఉంటారు: సబిత
  • వీసీలే కమిటీ ఛైర్మన్లుగా ఉంటారు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  • వర్సిటీల్లో 3 వేలకు పైగా పోస్టులు భర్తీ చేస్తున్నాం: సబిత
  • ఇక్కడి వర్సిటీల్లో దేశంలో ఎక్కడా లేని పే స్కేల్ ఇస్తున్నాం: సబిత

12:09 September 13

ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణకు శాసనసభ ఆమోదం

  • ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణకు శాసనసభ ఆమోదం
  • కావేరి, గురునానక్, శ్రీనిధి, ఎంఎన్ఆర్, నిక్‌మార్ వర్సిటీలకు అనుమతిస్తూ ఆమోదం
  • కొత్త ప్రైవేట్ వర్సిటీల్లో తెలంగాణ విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లు

12:08 September 13

  • దసరాలోగా వెయ్యి మంది కొత్త వైద్యుల నియామకం: హరీశ్‌రావు
  • మిగిలిన ఉద్యోగాలకూ త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తాం: హరీశ్‌రావు
  • ఈసారి 800 మంది ఎస్‌ఆర్‌లను జిల్లాల్లోనే నియమించాం: హరీశ్‌రావు
  • రాష్ట్రంలో 103 డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేశాం: హరీశ్‌రావు

12:03 September 13

  • వందపడకల ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బందిని భర్తీ చేయాలి: రఘునందనరావు
  • వందపడకల ఆస్పత్రుల్లో సీనియర్ వైద్యులను నియమించాలి: రఘునందనరావు

12:03 September 13

  • వైద్యకళాశాలలు, ఆస్పత్రుల్లో ఖాళీలు భర్తీ చేయాలి: శ్రీధర్‌బాబు
  • ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలి: శ్రీధర్‌బాబు
  • ఆస్పత్రుల్లో ఆధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేయాలి: శ్రీధర్‌బాబు

11:55 September 13

  • ప్రతి జిల్లాలో వైద్యకళాశాల ఉండాలని సీఎం ఆదేశించారు: హరీశ్‌రావు
  • 33 జిల్లాల్లోనూ వైద్యకళాశాలలు ఉండేలా చర్యలు: హరీశ్‌రావు
  • 17 వైద్యకళాశాలలు ఈ ఏడాది నుంచే పనిచేస్తాయి: హరీశ్‌రావు
  • వచ్చే ఏడాది నుంచి మరో 9 వైద్యకళాశాలలు పనిచేస్తాయి: హరీశ్‌రావు

11:54 September 13

  • జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం

11:54 September 13

  • ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్‌ ప్రొఫైల్‌ తీసుకొచ్చాం: కేటీఆర్‌
  • ఎవరూ అడగకున్నా ములుగుకు వైద్యకళాశాల ఇచ్చాం: కేటీఆర్‌
  • మా పథకాలు, అభివృద్ధి పనుల్లో స్వపక్షం, విపక్షం తేడా చూడం: కేటీఆర్‌

11:54 September 13

  • ములుగును పురపాలికగా ప్రకటించినందుకు ధన్యవాదాలు: సీతక్క
  • ములుగులో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయాలి: సీతక్క
  • ములుగులో త్వరగా కలెక్టరేట్‌ ఏర్పాటు చేయాలి: సీతక్క

11:36 September 13

జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన అసెంబ్లీ

  • జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
  • అజమాబాద్ పారిశ్రామిక చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
  • ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణకు శాసనసభ ఆమోదం
  • కేతనపల్లి పురపాలిక పేరును రామకృష్ణాపూర్‌గా పేరు మార్పు: కేటీఆర్‌
  • ములుగు పంచాయతీని పురపాలికసంఘంగా మారుస్తున్నాం: కేటీఆర్‌

11:36 September 13

  • అసెంబ్లీ ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు
  • మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని అసెంబ్లీ ముట్టడి
  • మత్స్యకారుల టెండర్లను ఆంధ్ర వారికి ఇస్తున్నారని ఆందోళన
  • తెలంగాణ మత్స్యకారులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆందోళన
  • తెలంగాణ మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్

11:30 September 13

ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ

  • ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ
  • మరికొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతులు ఇచ్చేందుకు బిల్లు

11:07 September 13

కాంగ్రెస్ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానం తిరస్కరణ

  • రెండు తీర్మానాలను ఆమోదించిన శాసనసభ
  • కాంగ్రెస్ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానం తిరస్కరణ

10:44 September 13

కేసీఆర్‌ను గద్దె దించే వరకు విశ్రమించను: ఈటల రాజేందర్‌

  • సభ నుంచి వెలుపలకి వచ్చిన ఈటల రాజేందర్‌
  • తన వాహనంలో వెళ్తున్న ఈటలను అడ్డుకున్న పోలీసులు
  • పోలీసుల వాహనంలో ఈటలను పంపించిన పోలీసులు
  • తనను అరెస్ట్‌ చేస్తున్నారా అంటూ పోలీసులను ప్రశ్నించిన ఈటల
  • పోలీసుల తీరుతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల రాజేందర్
  • బానిసలా వ్యవహరించవద్దంటూ పోలీసులపై ఈటల ఆగ్రహం
  • ఏడాదిగా కుట్ర చేస్తున్నారు: ఈటల రాజేందర్‌
  • నేను గెలిచినప్పటి నుంచి అసెంబ్లీకి హాజరుకాకుండా చేస్తున్నారు: ఈటల
  • కేసీఆర్‌ను గద్దె దించే వరకు విశ్రమించను: ఈటల రాజేందర్‌

10:32 September 13

కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలని తీర్మానం ప్రవేశపెట్టిన కేటీఆర్‌

  • కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలని తీర్మానం ప్రవేశపెట్టిన కేటీఆర్‌
  • అంబేడ్కర్‌ గొప్పదనం గురించి నిన్న సభలో కేసీఆర్‌ చెప్పారు: కేటీఆర్‌
  • దేశానికి దార్శనికతను చూపి వ్యక్తి అంబేడ్కర్‌: కేటీఆర్‌
  • అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చింది: కేటీఆర్‌
  • అంబేడ్కర్‌ చూపిన బాటలోనే మేము నడుస్తున్నాం: కేటీఆర్‌
  • సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యం సాధించకుండా రాజకీయ ప్రజాస్వామ్యం విజయవంతం కాదు అని అంబేడ్కర్‌ చెప్పారు: కేటీఆర్‌
  • అంబేడ్కర్‌కు తెలంగాణ రాష్ట్రం రుణపడి ఉంటుంది: కేటీఆర్‌

10:13 September 13

సభ నుంచి ఈటల రాజేందర్‌ సస్పెన్షన్‌

  • సభ నుంచి ఈటల రాజేందర్‌ సస్పెన్షన్‌
  • సమావేశాలు ముగిసే వరకు ఈటల రాజేందర్‌పై సస్పెన్షన్‌ వేటు

10:10 September 13

  • ఈటల రాజేందర్‌.. సభాపతిపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు: ప్రశాంత్‌ రెడ్డి
  • గతంలో ఉద్దేశపూర్వకంగా సస్పెండ్‌ చేయించుకున్నారు: ప్రశాంత్‌ రెడ్డి
  • సభలో చర్చకంటే... బయట రచ్చకే వారు మెుగ్గు చూపుతున్నారు: ప్రశాంత్‌ రెడ్డి
  • ఈటల రాజేందర్‌ సభలో ఉండి చర్చ చేయాలని మేము కోరుకుంటున్నాం: ప్రశాంత్‌ రెడ్డి
  • ఈటల రాజేందర్‌... క్షమాపణ చెప్పి చర్చలో పాల్గొనాలి: ప్రశాంత్‌ రెడ్డి
  • ఈటల రాజేందర్‌.. సభా మర్యాదలను కాపాడాలని కోరుతున్నాం: ప్రశాంత్‌ రెడ్డి

10:10 September 13

  • ఈటల రాజేందర్‌.. సభకు క్షమాపణ చెప్పాలి: వినయ్‌ భాస్కర్‌
  • ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి: వినయ్‌ భాస్కర్‌

09:30 September 13

Ts assembly sessions Live updates

  • తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
  • ఇవాళ కూడా ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు
  • శాసనసభ, మండలిలో రెండు అధికారిక తీర్మానాలు
  • ప్రతిపాదిత విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ, ఉపసంహరించుకోవాలని తీర్మానం
  • కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరుతూ తీర్మానం
  • శాసనసభలో నిన్న ప్రవేశపెట్టిన ఏడు బిల్లులపై చర్చ
  • జీఎస్టీ, మోటార్ వాహనాల పన్ను, జీహెచ్ఎంసీ- పురపాలక బిల్లులపై చర్చ
  • అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్టసవరణ బిల్లులపై చర్చ
  • పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ బిల్లులపై చర్చ
  • వర్సిటీలకు ఉమ్మడి నియామక మండలి ఏర్పాటు బిల్లులపై చర్చ
  • అటవీ విశ్వవిద్యాలయ ఏర్పాటు బిల్లులపై చర్చ
  • శాసనసభ ఆమోదం అనంతరం మండలి ముందుకు బిల్లులు
  • రెండు సభల్లోనూ ఇవాళ 2 కీలక అంశాలపై స్వల్పకాలిక చర్చ
  • ఎఫ్‌ఆర్‌బీఎం రుణపరిమితి విషయంలో ఉభయసభల్లో చర్చ
  • కేంద్ర ద్వంద్వ విధానాలు- రాష్ట్ర ప్రగతిపై ప్రభావంపై చర్చ
  • ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణ హామీల అమల్లో కేంద్ర వైఫల్యంపై చర్చ
Last Updated : Sep 13, 2022, 4:54 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details