బాహ్య వలయ రహదారిపై జరిగే ప్రమాదాల్లో క్షతగాత్రులు, బాధితులకు సత్వర చికిత్స అందించేందుకుగానూ.. రాష్ట్ర ప్రభుత్వం ట్రామా కేంద్రాలు, అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించనుంది. ప్రపంచ ట్రామా దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ఔటర్ రింగురోడ్డులో ట్రామా కేంద్రాలు ప్రారంభించనున్నారు.
ఓఆర్ఆర్పై.. ట్రామా కేంద్రాలు ప్రారంభించనున్న సర్కారు - Outer ring Road
బాహ్య వలయ రహదారిపై ప్రమాదాల్లో గాయపడిన వారికి సత్వర చికిత్స అందించేందుకు గానూ.. రాష్ట్ర ప్రభుత్వం ట్రామా కేంద్రాలు, అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఏర్పాట్లన్ని సిద్ధం చేసింది. ట్రామా కేంద్రాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
ఓఆర్ఆర్పై.. ట్రామా కేంద్రాలు ప్రారంభించనున్న సర్కారు
జీహెచ్ఎంసీ చుట్టు ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డులో గల 20 ఎగ్జిట్ కేంద్రాల్లో.. రెండింటికి కలిపి ఒకటి చొప్పున పది ట్రామా కేంద్రాలు, అంబులెన్సులు ఏర్పాటు చేశారు. తక్షణ వైద్యచికిత్స అందేలా అవసరమైన అన్ని రకాల అత్యాధునిక ఉపకరణాలు ఈ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లలో ఉంటాయి. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తారు. ప్రమాదాలు జరిగిన వెంటనే తక్షణ చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.