రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన టీఆర్‌టీ అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలని ప్రగతి భవన్ వద్ద చేపట్టిన నిరసన అరెస్టుకు దారితీసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు వినతి పత్రం అందజేయాలని టీఆర్‌టీ అభ్యర్థులు ఉదయం 7 గంటల వరకే బేగంపేటలోని ప్రగతి భవన్కు చేరుకున్నారు. వర్షం వచ్చినా లెక్కచేయకుండా నిరసన తెలిపారు. తమ గోడును సీఎంకు విన్నవించుకునేందుకు అనుమతివ్వాలని పోలీసులను ప్రాధేయపడ్డారు. అనుమతి లేకుండా అభ్యర్థులు ప్రగతి భవన్ వచ్చినందుకు వారిని అరెస్ట్ చేశారు. అనంతరం నిరసన కారులను గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన తమను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. గోషామహల్ పోలీస్ స్టేషన్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని సంఘం నాయకులు హెచ్చరించారు.
ప్రగతి భవన్ వచ్చిన టీఆర్‌టీ అభ్యర్థుల అరెస్ట్ - TRS
ముఖ్యమంత్రి కేసీఆర్కు వినతి పత్రం అందజేసేందుకు ప్రగతి భవన్ వచ్చిన టీఆర్‌టీ అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ గోడు వినిపించుకునేందుకు వస్తే అరెస్ట్ చేస్తారా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
ప్రగతి భవన్ వచ్చిన టీఆర్‌టీ అభ్యర్థుల అరెస్ట్