పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన 8792 మంది టీఆర్టీ అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలని వారు హైదరాబాద్లో ఆందోళనకు దిగారు. ఇందిరాపార్కు ధర్నాచౌక్లో టీఆర్టీ రాష్ట్ర సంఘం చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, పీఆర్టీయూ నేతలు దర్శించి సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై నర్సిరెడ్డి మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత మంత్రులు కూడా ఉపాధ్యాయుల విషయంలో ఇచ్చిన హామీ అమలు కాలేదని ఆర్ కృష్ణయ్య ఆరోపించారు.
పోస్టింగులివ్వండి: టీఆర్టీ అభ్యర్థులు - trt
కష్టపడి చదివారు.. కొలువులు సాధించారు. కానీ వారి పోస్టింగులు మాత్రం ఇవ్వలేదు. ఇది టీఆర్టీ అభ్యర్థుల పరిస్థితి. ఇప్పటికైనా తమకు ఉద్యోగాలు ఇవ్వాలని వారు ఆందోళన బాట పట్టారు.
ధర్నాలో కృష్ణయ్య