ఎంపికైన నిరుద్యోగులం...
'ఉద్యోగమివ్వకుంటే కారుణ్య మరణాన్ని ప్రసాదించండి'
ఉపాధ్యాయ నోటిఫికేషన్ పడితే సంబరపడ్డారు. కష్టపడి చదివి మెరిట్‌గా నిలిచారు. నియామకాలు చేపట్టడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వారికి తీరని వేదన కలిగించింది. ఎన్నాళ్లు వేచి చూసినా లాభం లేదనుకున్నారు. కారుణ్య మరణాన్ని ప్రసాదించాలంటూ టీఆర్టీ అభ్యర్థులు నాంపల్లిలో హెచ్ఆర్సీని ఆశ్రయించారు.
కారుణ్య మరణానికి అనుమతులివ్వండి
ఇన్ని రోజులుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న తమ కుటుంబాలు ప్రస్తుతం రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజుల్లోగా ప్రభుత్వం స్పందించి నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కౌన్సిలింగ్ తేదీలు ప్రకటించకుంటేకారుణ్య మరణానికైనా అనుమతివ్వాలని కోరారు.
ఇదీ చదవండి :'కాంగ్రెస్‌లో నాయకత్వ లోపంతోనే పార్టీని వీడాను'
Last Updated : Mar 28, 2019, 7:39 PM IST