రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. రేపటి భారత్ బంద్‌లో పూర్తిస్థాయిలో పాల్గొనేందుకు సన్నద్ధమైంది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలందరూ ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొననున్నారు. బెంగళూరు రహదారిపై షాద్‌నగర్ సమీపంలోని బూర్గుల గేట్ వద్ద కేటీఆర్ రాస్తోరోకోకు హాజరుకానున్నారు.
భారత్‌బంద్‌లో పాల్గొనేందుకు సన్నద్ధమైన తెరాస - Information of trs
భారత్‌బంద్‌లో పాల్గొనేందుకు తెరాస సన్నద్ధమైంది. ప్రత్యక్ష ఆందోళనల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. షాద్‌నగర్ సమీపంలో బూర్గుల గేట్ వద్ద కేటీఆర్ రాస్తోరోకోకు హాజరుకానున్నారు.
ఆలంపూర్లో మంత్రి నిరంజన్ రెడ్డి, మహేశ్వరం వద్ద మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్, హైదరాబాద్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖమ్మంలో పువ్వాడ అజయ్ నిరసనల్లో పాల్గొనాలని నిర్ణయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి నియోజకవర్గాల్లో రైతులకు సంఘీభావంగా బంద్‌లో పాల్గొనాలని తెరాస నాయకత్వం పిలుపునిచ్చింది. తెరాస అనుబంధ సంఘాలు కూడా చురుగ్గా భాగస్వామ్యమయ్యేలా సిద్ధమయ్యాయి. ఉదయం కనీసం రెండు గంటల పాటు బంద్‌లో పాల్గొనాలని వ్యాపార, వాణిజ్య సంస్థలను కేటీఆర్ కోరారు.