తెలంగాణ

telangana

ETV Bharat / state

'సభ్యత్వ నమోదును సద్వినియోగం చేసుకోవాలి'

సభ్యత్వ నమోదు కోసం మిగిలిన నాలుగు రోజులను సద్వినియోగం చేసుకోవాలని తెరాస పార్టీ ప్రధాన కార్యదర్శి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్​ఛార్జి బండి రమేష్ పార్టీ శ్రేణులను కోరారు. కష్టపడిన వారికి పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.

trs party Membership

By

Published : Jul 17, 2019, 5:35 PM IST

నాంపల్లిలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్​తో కలిసి పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్​ పలువురికి సభ్యత్వాలు అందజేశారు. సభ్యత్వాల నమోదుకు మిగిలిన నాలుగు రోజులను సద్వినియోగం చేసుకోవాలని బండి రమేష్​ పార్టీశ్రేణులను కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై స్పందన సభ్యత్వాలలో స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు ఎంత శ్రమించి పనిచేస్తే అంతమంచి ఫలితాలు ఆశించవచ్చని... కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. అనంతరం బండి రమేష్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా జరిపాయి.

'సభ్యత్వ నమోదును సద్వినియోగం చేసుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details