అంబర్పేట నియోజకవర్గంలోని గోల్నాక డివిజన్ నూతన కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ పాదయాత్రగా చేస్తూ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గోల్నాక డివిజన్ ప్రజలు తెరాస ప్రభుత్వంతో పాటు తొలిసారి పోటీ చేసిన తనపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు ఇంటింటికి వెళ్లి ధన్యవాదాలు తెలిపారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని మరోసారి హామీ ఇచ్చారు. డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని, స్థానికంగా ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరిస్తానని తెలిపారు.
'కొత్త కార్పొరేటర్ కృతజ్ఞత యాత్ర.. సేవ చేస్తానని హామీ' - హైదరాబాద్ లేటెస్ట్ న్యూస్
ఎన్నికల ప్రచారంలోనే కాదు.. గెలుపొందిన తర్వాత పాదయాత్ర చేపట్టారు గోల్నాక డివిజన్ నూతన కార్పొరేటర్ దూసరి లావణ్య. తొలిసారి పోటీ చేసిన తనని గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని హామీ ఇచ్చారు.
'కృతజ్ఞతలతో కొత్త కార్పొరేటర్ పాదయాత్ర... సేవ చేస్తానని హామీ'
తనపై నమ్మకంతో టికెట్ ఇచ్చిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:ప్రకటనలకే పరిమితం.. కానరాని ప్రత్యామ్నాయం