AUDIO TAPS VIRAL: నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం వ్యవహారంలో మరో మలుపు.. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారంటూ నమోదైన కేసులో నిందితులు రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజిలు.. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డితో జరిపినట్లు చెబుతున్న ఫోన్ సంభాషణల ఆడియోలు రెండు శుక్రవారం వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. మొదటి ఆడియోలో ఓ కీలకనేత పేరు ఉండగా, రెండోదాంట్లో పార్టీ మారే ఎమ్మెల్యేలకు ఇచ్చే డబ్బులు, ఈడీ, ఐటీ సహా ఎవరూ జోలికి రాకుండా చూసుకోవడంతో సహా పలు అంశాలున్నాయి.
రెండో ఆడియో పూర్తిగా ఆర్థిక లావాదేవీల చుట్టూ సాగింది. రోహిత్‌తోపాటు ఎంత మంది వస్తారు? ఎంత ఇవ్వాలి? అనే విషయాలను చర్చించారు. వాళ్లు వస్తే ప్రభుత్వం పడిపోవడం ఖాయమని చెప్పినట్లుగా ఉంది. తుషార్, బీఎల్ సంతోష్, నంబరు 1, 2 పేర్ల గురించీ చర్చించుకున్నారు. అయితే ఈ ఆడియోలు అనధికారికంగా వెలుగులోకి వచ్చాయి. వీటిపై నిందితులు కానీ, పోలీసులు కానీ స్పందించలేదు. ఆడియోటేపుల్లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
తొలి ఆడియోలో దాగి ఉన్న సంభాషణలు..
రామచంద్రభారతి:హలో
రోహిత్‌రెడ్డి:స్వామీజీ ఎలా ఉన్నారు?
రామచంద్ర:బాగున్నాను. మీరెలా ఉన్నారు?
రోహిత్:జీ.. నందూజీకి, మాకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. నేను ఇప్పటికే వారితో మాట్లాడాను. వారు ఒప్పుకొన్నారు.
రామచంద్ర:నాకు ఒకసారి పేర్లు ఖరారు చేస్తే సులభమైపోతుంది.
రోహిత్:స్వామిజీ ఇప్పుడే పేర్లు చెప్పడం కష్టం. ఇప్పటికైతే ఇద్దరు కన్‌ఫర్మ్ చేశారు. ఓసారి కలిసి మాట్లాడుకుంటే మంచిది.
రామచంద్ర:కచ్చితంగా కలుద్దాం. 24 వరకు నేను బెడ్‌రెస్ట్‌లో ఉంటాను. హైదరాబాద్ వద్దు ఇంకెక్కడైనా కలుద్దామా?
రోహిత్:అలా కాదు స్వామిజీ. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. మా మీద కూడా దృష్టి ఉంటుంది. మేమంతా హైదరాబాద్‌లోనే ఉంటాం కాబట్టి ఇదే అనువైన ప్రదేశం మనకు. మీరు కలవాలనుకున్న రోజు బి.ఎల్.సంతోష్‌జీ కూడా చార్టర్‌లో వస్తారని నందూ చెప్పారు. ఒక అరగంట మాట్లాడుకొని ముగించుకోవచ్చు.
రామచంద్ర:రేపు బీఎల్ సంతోష్‌తో మాట్లాడతా. బల్క్‌గా ఉంటే ఆయన వస్తారు.
రోహిత్:ఓకే స్వామీజీ. మనం అలాగే చేద్దాం కానీ..
రామచంద్ర:మీరు నందూజీతో ఏదైతే మాట్లాడారో అందులో ఎలాంటి సమస్యా లేదు. మిగిలిన విషయాలు మనం మాట్లాడుకోవచ్చు.
రోహిత్:నందూజీ నాకు ఈ ప్రతిపాదన ఇచ్చారు. నేను ఓకే అనుకున్నా. నా రక్షణ, భవిష్యత్‌పై ఆయన హామీ ఇచ్చారు.
రామచంద్ర:కచ్చితంగా ఇదే విషయం మరోసారి మీ ముందే మాట్లాడుకుందాం. ముందు వచ్చిన వారే ముందు వరుసలో ఉంటారు. మీరు వ్యవస్థను బాగా చదివారు. అసలు విషయమేంటో కచ్చితంగా తెలుసు. అందుకే మిమ్మల్ని ప్రమోట్ చేయడం మాకు చాలా సులభం.
రోహిత్:నేను కూడా ఆసక్తిగానే ఉన్నా. ఇప్పటికే నా గురించి మీ అందరికీ తెలుసు.
రామచంద్ర:తప్పకుండా మీకు మేం మద్దతుగా ఉంటాం. మనం ఫోన్‌లో మాట్లాడుకోవడం మంచిది కాదు. ఇందులో ఎలాంటి సందిగ్ధత లేదు. మిగిలిందంతా మేం చూసుకుంటాం. మీరు ఎలాంటి ప్రతిపాదన ఇచ్చినా దాని ప్రకారమే ముందుకెళ్తాం.
రోహిత్:నాకేమీ తొందరలేదు. నందూయే తొందరపెడుతున్నారు.
రామచంద్ర:మునుగోడు ఎన్నిక తేదీ కంటే ముందే చేరితే మరోలా ఉంటుంది. మాకు బలమైన లీడర్ కావాలనుకున్నాం. నేనే నందూపై ఒత్తిడి తెస్తున్నా. 4, 5 రోజులుగా నందు నిద్ర కూడా పోవడం లేదు. మరో ఇద్దరు, ముగ్గురి పేర్లు కూడా నందూ తీసుకొచ్చాడు కానీ వద్దనుకున్నాం. ఈ నెల 26న కూర్చుంటే బాగుంటుంది. 25న అయినా ఫర్వాలేదు.
నందుకుమార్:ఈ నెల 25న గ్రహణం ఉంది. ఆ తర్వాత మనం ఎప్పుడు కూర్చున్నా బాగుంటుంది. మేం కూడా ఎక్కువమందిని తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఎలాగూ దీపావళి కూడా ఉంది.
రామచంద్ర:నేను ఇప్పటికే ఇద్దరికీ విషయం చెప్పాను.
నందు:ఇద్దరికీ చెప్పారా స్వామీజీ..? వాళ్లు ఈరోజు అనుకుంటున్నారు కదా.
రామచంద్ర:అవును. అందుకే దిల్లీలో ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు చార్టర్‌లో అహ్మదాబాద్ వెళ్తున్నారు.
నందు:నంబర్ 2తోనా? నంబర్1తోనా?
రామచంద్ర:నంబర్2తో..
రోహిత్:స్వామీజీ.. ఎక్కువమందిని ప్రయత్నం చేయొద్దు. మా సీఎం గురించి మీకు తెలుసు కదా. చాలా దూకుడు స్వభావం గల వ్యక్తి. మా సీఎంకు తెలిస్తే మా పని పడతారు.
రామచంద్ర:ఆ ముగ్గురి పేర్లు నేను తెలుసుకుంటే ముందుకెళ్లడానికి మరింత సులభం. అధిష్ఠానం నుంచి గ్రీన్‌సిగ్నల్ ఉంది. మనం ఈ నెల 26న కూర్చొని మాట్లాడుకుందాం. ఎవరెవరు ఓకే అన్నారో నంబర్2 ఎదుట పేర్లు చెబుతారా?
రోహిత్:నంబర్2 ఎదుట పేర్లు చెప్పడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. ప్లీజ్.. ప్లీజ్.. ఈ విషయం బయటకు రావొద్దు.
రామచంద్ర:మీకు ఈడీ నుంచి ఐటీ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ భద్రత, భవిష్యత్ అంతా కేంద్రం చూసుకుంటుంది. మా సంస్థలో సంతోష్ చాలా కీలకం. నంబర్1, 2లే ఆయన ఇంటికి వస్తుంటారు. ఆయన వారి దగ్గరకు వెళ్లరు. అది మా సంస్థలో ప్రొటోకాల్. ఇలాంటి విషయాలను హ్యాండిల్ చేయడంలో బెంగాల్ ఎపిసోడ్ మాకు మంచి అనుభవం.
నందు:స్వామీజీ మరొక్క విషయం. రోహిత్‌కు శరత్ చాలా దగ్గరి వ్యక్తి.
రామచంద్ర:అరబిందో ఫార్మా శరతేనా..? అది చాలా సంక్లిష్టమైన కేసు. మనం వారితో కూర్చొని డీల్ చేయాలి.
నందు:స్వామీజీ, మీరు వచ్చినప్పుడు వాళ్లతో మీటింగ్ ఏర్పాటు చేస్తాం.
రోహిత్:నందన్నా ఈ తప్పుడు వాగ్దానాలు వద్దు. స్వామీజీ.. అతను నాకు మంచి మిత్రుడే కానీ, ప్రస్తుతానికి ఆ విషయంలో ఇన్‌వాల్వ్ కాలేను.
రామచంద్ర:సరే, ఫర్వాలేదు, మనం ఒకదాని తర్వాత ఒకటి ఆలోచిద్దాం.
రెండో ఆడియో టేప్‌లో ఇలా...
నందుకుమార్:నిన్న ఉదయం పైలట్‌తో సమావేశం జరిగింది. దాదాపుగా ఓకే చెప్పాడు. మీకు ఏం కావాలన్నా.. చూసుకుంటామని చెప్పాను. నువ్వే మొదట వస్తే టీంలీడర్‌గా ఉంటావని చెప్పా. నాకు ఒక రేటు చెప్పండి. మిగిలిన వారికి నేను చూసుకుంటా.. అన్నాడు.
రామచంద్రభారతి:అతనికి ఎంత కావాలట?