తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస సభ్యత్వ నమోదుకు విశేష స్పందన వస్తోంది: కేటీఆర్ - Minister ktr teleconfarence

తెరాస సభ్యత్వ నమోదు ప్రక్రియ విస్తృతంగా కొనసాగుతోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తెలిపారు. తెరాస సభ్యత్వ నమోదు ఇం‌ఛార్జీలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెలాఖరు నాటికి సభ్యత్వాల నమోదు పూర్తి చేయాలని నేతలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు.

నెలాఖరు నాటికి సభ్యత్వ నమోదు పూర్తిచేయాలి: కేటీఆర్
నెలాఖరు నాటికి సభ్యత్వ నమోదు పూర్తిచేయాలి: కేటీఆర్

By

Published : Feb 22, 2021, 5:21 PM IST

Updated : Feb 22, 2021, 5:57 PM IST

తెరాస సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ పేర్కొన్నారు. లక్ష్యానికి మించి సభ్యత్వాలు కానున్నాయని ధీమా వ్యక్తం చేశారు. తెరాస సభ్యత్వ నమోదు ఇంఛార్జీలతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోందని కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యత్వ నమోదుకు వస్తున్న స్పందన ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. ఈ నెలాఖరు నాటికి సభ్యత్వాల నమోదు పూర్తి చేయాలని నేతలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు.

ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో పాల్గొనాలని కోరారు. సభ్యత్వాలను వెను వెంటనే డిజిటలీకరణ చేయాలని చెప్పారు. వచ్చే నెలలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కమిటీల పునర్నిర్మాణం జరుగుతుందన్నారు.

ఇదీ చూడండి:సభాపతి పోచారం, మంత్రి ఎర్రబెల్లికి సమన్లు

Last Updated : Feb 22, 2021, 5:57 PM IST

ABOUT THE AUTHOR

...view details