హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలోని విజయ్ నగర్ కాలనీలో తెరాస ఇంఛార్జీ సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు ముఖ్య అతిథులుగా హాజరై సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురికి సభ్యత్వం అందించారు. నాంపల్లిలో టీఆర్ఎస్ సభ్యత్వం జోరుగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు నచ్చి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో సభ్యత్వం తీసుకుంటున్నారని తలసాని వివరించారు.
అపర భగీరథుడు కేసీఆర్: మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
అపర భగీరథుడు కేసీఆర్: మంత్రి తలసాని
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో హైదరాబాద్ మహా నగరానికి మరో 50 సంవత్సరాలు నీటికొరత లేకుండా కాళేశ్వరం నుంచి నీటిని తరలిస్తున్నారని మంత్రి తెలిపారు. పండుగలకు కూడా నిధులు మంజూరు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:నిబంధనలకు విరుద్ధంగా బోర్లు తవ్వుతున్నారు