రాఖీ పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ కొండాపూర్‌లోని మంత్రి హరీశ్‌రావు నివాసంలో ఆయనకు తెరాస మహిళా నాయకులు రాఖీ కట్టారు. మంత్రి హరీశ్‌రావు.. రాష్ట్ర ప్రజలందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పర్వదినం సోదరసోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు. ఈ రక్షాబంధన్... సోదరీ, సోదరుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాలని హరీశ్‌రావు ఆకాంక్షించారు.
మంత్రి హరీశ్ రావుకు రాఖీ కట్టిన తెరాస మహిళలు
హైదరాబాద్ కొండాపూర్‌లోని మంత్రి హరీశ్‌రావు నివాసంలో రక్షా బంధన్‌ను పురస్కరించుకుని తెరాస మహిళా నాయకులు ఆయనకు రాఖీ కట్టారు. సోదరీ, సోదరులు ఇంట్లోనే ఉంటూ... సురక్షిత వాతావరణంలో, ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని మంత్రి కోరారు.
harish rao
ఇంట్లోనే ఉంటూ... సురక్షిత వాతావరణంలో, ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని మంత్రి సూచించారు. కరోనా వైరస్‌పై విజయం సాధించేందుకు అన్ని ముందస్తు జాగ్రత్తలను పాటిస్తామని ప్రతి ఒక్కరం ప్రతిజ్ఞ చేసి వాటిని పాటించాలన్నారు.
ఇదీ చూడండి :పీఎస్‌కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు
Last Updated : Aug 3, 2020, 2:22 PM IST