తెలంగాణ

telangana

ETV Bharat / state

బండి సంజయ్‌పై తెరాస నేతల ఫిర్యాదు - trs leaders Complaint to the Electoral Officer

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా కొనసాగుతోంది. అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పలువురు నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ ఎంపీ అర్వింద్​పై తెరాస నేతలు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.

trs leaders complained about Bandi Sanjay
బండి సంజయ్‌పై ఫిర్యాదు చేసిన తెరాస నేతలు

By

Published : Oct 29, 2020, 10:55 PM IST

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్షాలు హోరాహోరీగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఒకరిపై ఒకరు వాగ్బాణాలు సంధించుకుంటూ... ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఈ తరుణంలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌పై తెరాస నేతలు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్నారు.

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఎంపీ అర్వింద్‌పై ఫిర్యాదు చేసిన దుబ్బాక తెరాస నేతలు... మంత్రి హరీశ్‌రావును వ్యక్తిగతంగా దూషించారని తెరాస నేతలు వెల్లడించారు.

ఇదీ చూడండి :ఆర్థిక సాయం అందట్లేదని వరద బాధితుల ఆందోళనలు

ABOUT THE AUTHOR

...view details