Trs Went To High Court munugode bypoll Symbols: మునుగోడు ఉపఎన్నికల్లో గుర్తులపై హైకోర్టులో తెరాస లంచ్ మోషన్ దాఖలు చేసింది. కారును పోలిన ఎనిమిది గుర్తులు తొలగించాలని తెరాస కోర్టును కోరింది. కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడ గుర్తు కేటాయించవద్దని తెరాస హైకోర్టును కోరింది. భోజన విరామంలో అత్యవసర విచారణ జరపాలని విజ్ఞప్తి చేయగా ధర్మాసనం నిరాకరించింది. నవంబరు 3న పోలింగ్ ఉన్నప్పటికీ ఈసీ నిర్ణయం తీసుకోవడం లేదని తెరాస హైకోర్టుకు తెలిపింది. దీనిని మధ్యాహ్నం పరిశీలించలేమని.. రేపు విచారణ జరుపుతామని సీజే ధర్మాసనం పేర్కొంది.
ఆ గుర్తులు తొలగించాలని తెరాస పిటిషన్.. రేపు విచారిస్తామన్నహైకోర్టు - High Court Latest News
11:00 October 17
మునుగోడు ఉపఎన్నికల్లో గుర్తులపై హైకోర్టులో రేపు విచారణ
గతంలో 2018 ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల వల్ల తమ అభ్యర్థులకు నష్టం జరిగిందని తెరాస చెబుతోంది. పలు నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల కన్నా.. ఈ గుర్తులతో బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. కారును పోలి ఉన్నందునే వాటికి ఓట్లు పడ్డట్లు స్పష్టమవుతోందని ఈసీకి తెరాస వివరించింది. మునుగోడు, జహీరాబాద్, సిర్పూర్, డోర్నకల్‌లో 2018 ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తుకు సీపీఎం, బీఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆ పార్టీ నేతలు తెలిపారు. నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, నాగార్జునసాగర్‌లో కెమెరా గుర్తుకు కూడా బీఎస్పీ, సీపీఎం కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ 8 గుర్తులను తొలగించాలని గులాబీనేతలు కోరుతున్నారు.
ఇవీ చదవండి:KTR Tweet on Modi: మోదీకి నోబెల్ బహుమతి ఎందులో ఇవ్వాలి..?
ఉద్యోగులకు బంపర్ బొనాంజా, కార్లు బైక్‌లు గిఫ్ట్‌గా ఇచ్చిన 'చల్లని' వ్యాపారవేత్త