కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెరాస ముందుకు వెళ్తోంది. శనివారం మున్సిపాలీటీల్లోని నాయకులు, ఎమ్మెల్యేలతో సమావేశమైన ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. ఆదివారం కార్పొరేషన్ల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. 10 కార్పొరేషన్లలో విజయం సాధించాల్సిందేనని కేటీఆర్ వారికి తేల్చిచెప్పారు. భౌగోళికంగా పెద్దవైన పురపాలికల్లో పార్టీ విజయం సాధించాల్సిందేనన్నారు. ఈ సమావేశంలో మంత్రులు మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమాలాకర్, ఎమ్మెల్యే గణేశ్ బిగాలా, కోరుకంటి చందర్, పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముఖ్యమంత్రి పొలిటికల్ సెక్రటరీ శేరి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు.
క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చ
మున్సిపాలిటీలతో పోల్చితే, కార్పొరేషన్లలో తెరాస తరఫున పెద్ద ఎత్తున నామినేషన్ల వేసిన నేపథ్యంలో ఇక్కడ బీ ఫారాలు దక్కే అభ్యర్థులు తప్ప ఏవరూ పోటీలో లేకుండా చూడాలన్నారు. కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, బడంగ్పేట్, మీర్పేట్, బండ్లగూడా జాగీర్, బోడుప్పల్, ఫీర్జాదీగూడా, జవహార్‌నగర్, నిజాంపేట్ కార్పొరేషన్లలోని క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించారు. స్వయంగా ఆయా కార్పోరేషన్ల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ మాట్లాడారు.
ప్రభుత్వ పథకాలు