తెలంగాణ

telangana

By

Published : Sep 2, 2021, 11:02 AM IST

ETV Bharat / state

YSR VARDHANTHI: ఇడుపులపాయలో వైఎస్‌ఆర్​కు జగన్‌, షర్మిల నివాళి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి నేడు. ఏపీలోని ఇడుపులపాయలో వైఎస్ సమాధివద్ద ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్​మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతి, తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల తదితరులు నివాళులర్పించారు.

YSR VARDHANTHI
వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి 12 వ వర్థంతి సందర్భంగా.. కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ ఘాట్‌ వద్ద సీఎం జగన్‌ నివాళులర్పించారు. జగన్‌తోపాటు భార్య భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కూడా అంజలి ఘటించారు. నాన్న భౌతికంగా దూరమై 12 ఏళ్లైనా.. ప్రజల మనిషిగా.. నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారని జగన్​ అన్నారు.

తన తండ్రి భౌతికంగా దూరమైన.. నేటికి ప్రజల మనిషిగా ఉన్నారని సీఎం జగన్‌ కొనియాడారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. నాన్న భౌతికంగా దూరమై 12 ఏళ్లైనా జనం మనిషిగా మెలిగారు. నేటికీ జన హృదయాల్లో నాన్న కొలువై ఉన్నారు. చిరునవ్వులు చిందించే ఆయన జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. నా ప్రతి ఆలోచనలో నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోందని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైకాపా శ్రేణులు, వైఎస్ అభిమానులు, కాంగ్రెస్ నేతలు ఘన నివాళి ఘటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి...

1949లో కడప జిల్లాలో జయమ్మ, రాజారెడ్డి దంపతులకు జన్మించిన రాజశేఖర్ రెడ్డి.. డాక్టర్‌ విద్యను అభ్యసించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలవైపు ఆకర్షితుడైన ఆయన ఎస్.వి.ఆర్.ఆర్ కళాశాలలో పనిచేస్తుండగానే అక్కడ హౌస్‌ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత వైద్యుడిగా పలుచోట్ల పని చేసిన ఆయన.. 1978లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. 1980-82లో గ్రామాభివృద్ధి శాఖా మంత్రిగా, 1982లో ఎక్సైజ్ శాఖా మంత్రిగా, 1982-83 కాలంలో విద్యాశాఖా మంత్రిగా పనిచేసి అయా మంత్రిత్వ శాఖల్లో తనదైన ముద్రను వేశారు. అంతేకాదు ఆరోగ్యశాఖా మంత్రిగా పనిచేసిన కాలంలో ఒక్క రూపాయి మాత్రమే జీతంగా తీసుకుంటూ.. పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఎంతోమంది అభిమానం చూరగొన్న ఆయన 2004లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి.. మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆయనకే ప్రజలు పట్టం కట్టారు. రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన రెండు నెలలకే సెప్టెంబర్ 2 తెలుగు ప్రజలందరినీ విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమం కోసం వెళ్లిన ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం రావడంతో.. విమానం కూలి మరణించారు.

ఇదీ చూడండి:Vijayasai reddy: ఈడీ కేసుల విచారణపై ‘సుప్రీం’కు వెళతాం

ABOUT THE AUTHOR

...view details