చట్టపరంగా వచ్చిన 13 హక్కులను అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులతోపాటు గిరిజనేతరులకు సమానంగా అమలు చేయాలన్నారు రైతు కూలీ, గిరిజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు. ప్రభుత్వం తక్షణమే గెంటివేతను ఆపివేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ విద్యానగర్లోని మాక్స్ భవన్లో ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అటవీ హక్కుల చట్టం సమగ్రంగా అమలు చేయాలన్నారు. గిరిజనులు,గిరిజనేతరులు సాగుచేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరుతూ ఈనెల 22 ,23, 24 తేదీలలో రాష్ట్రంలోని ఐటీడీఏ జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించినట్లు ఐక్య కార్యాచరణ కమిటీ నేత వేముల వెంకట్రామయ్య తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ హక్కుల అమలులో అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఆయా ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుటకు గిరిజనులు, ఇతర పేదలు సమైక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన కోరారు.
'అటవీ హక్కులు సమగ్రంగా అమలు చేయాలి' - రైతు కూలీ నేతలు
అటవీ హక్కులను కాలరాస్తే ప్రభుత్వంపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయడానికి సిద్ధమన్నారు రైతు కూలీ, గిరిజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు. ప్రభుత్వం గెంటివేతను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు.
Tribal jac