ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ఉన్నతాధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ కమిషనరేట్లో పదిమంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్లతో పాటు మరో ఎనిమిది మందిని బదిలీ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవీ చదవండి:పోలీసుల పాత్రపై ఆరా
నిర్లక్ష్యంగా ఉన్నందుకు...
ప్రధానంగా బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ గోవింద్‌రెడ్డికి ఈ కేసు నిందితుడు రాకేష్‌రెడ్డితో సంబంధాలున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై వేటు పడినట్టు సమాచారం. గతంలో గోవింద్‌రెడ్డి ఆదిభట్ల ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన సమయంలో రాకేష్‌రెడ్డితో సంబంధాలు కలిగినట్లు తేలడంతో ఉన్నతాధికారులు బదిలీ చేశారు. జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డికి జయరాం హత్య ఘటనపై సమాచారం అందినా సరిగా స్పందించలేదనే కారణంతో చర్యలు తీసుకున్నట్టు తెలిసింది.
ఇవీ చదవండి:జయరాం కేసు రోజుకో మలుపు...