విద్యుత్ సంస్థల పనితీరుపై... సోలార్ పవర్‌పై దృష్టి సారించటం లేదని నిన్న కొందరు ఆరోపణలు చేశారని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర రావు అన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 71 మెగావాట్లు ఉన్న సోలార్ విద్యుత్... ఇప్పుడు 3,600 మెగావాట్లకు చేరుకుందని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ నుంచి రూ.3.90లకు విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నామన్నారు. ఎంతో పారదర్శకంగా విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ సంస్థలు స్వతంత్ర సంస్థలని... తమపై ఎటువంటి ఒత్తిడులు లేవని... ఎటువంటి ప్రలోభాలకు లొంగలేదని వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తూ పారదర్శకంగా పనిచేస్తున్నామని, విద్యుత్ ఉద్యోగుల పనితీరుపై అవాస్తవాలు ప్రచారం చేయవద్దని పేర్కొన్నారు. తమ పనితీరుపై అనుమానాలుంటే సీబీఐ విచారణకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ప్రభాకర రావు తెలిపారు.
విద్యుత్‌పై సీబీఐ విచారణకు సిద్ధం: ట్రాన్స్‌కో సీఎండీ - prabhakar rao
విద్యుత్ సంస్థల పనితీరుపై కొందరు ఆరోపణలు చేశారని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు తెలిపారు. తాము ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని, అవాస్తవాలను ప్రచారం చేయెుద్దని పేర్కొన్నారు. తమపై అనుమానాలుంటే సీబీఐ విచారణకైనా సిద్ధమన్నారు.
అనుమానాలుంటే సీబీఐ విచారణకైనా సిద్ధం: ట్రాన్స్‌కో సీఎండీ