రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకి పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరాపై ప్రతిరోజూ సమీక్షిస్తున్నామని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు చెప్పారు. వేసవిలో గృహ అవసరాలు, వ్యవసాయం, పరిశ్రమల్లో విద్యుత్ అవసరాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉన్నామన్న ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
'కరెంటు కోతలు ఉండవు' - విద్యుత్ వినియోగం
ఇళ్లలో కరెంటు కోతలు, పెద్ద పరిశ్రమలకు పవర్ హాలిడేలు, చిన్న పరిశ్రమలకు అగచాట్లు ఇవీ.. ప్రతి వేసవిలో వినిపించే మాటలు. కానీ ఈసారి రాష్ట్రంలో ఆ పరిస్థితి రాదని అంటున్నారు విద్యుత్ శాఖ అధికారులు. సీఎం ఆదేశాలతో ముందస్తు సంసిద్ధంగా ఉన్నామని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు తెలిపారు. 24 గంటల విద్యుత్ సరఫరాకు ఏ లోటూ ఉండబోదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ట్రాన్స్‌కో సీఎండీ