తెలంగాణ

telangana

ETV Bharat / state

కాజీపేట-బళ్లార్ష సెక్షన్​లో రైళ్ల దారి మళ్లింపు - హైదరాబాద్​ వార్తలు

కాజీపేట-బళ్లార్ష సెక్షన్​లో రాఘవపూర్-కొలనూర్ రైల్వే స్టేషన్ల మధ్య మూడవ లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నందున కొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు ద.మ. రైల్వే ప్రకటించింది. దారి మళ్లించిన రైళ్ల వివరాలను ఆధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

trains divertions in kajipeta-balhrsha root in south centralrailways
కాజీపేట-బళ్లార్ష సెక్షన్​లో రైళ్ల దారి మళ్లింపు

By

Published : Oct 2, 2020, 2:37 AM IST

రాఘవపూర్-కొలనూర్ రైల్వే స్టేషన్ల మధ్య మూడవ లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో కొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు ద.మ. రైల్వే ప్రకటించింది. దారి మళ్లించిన రైళ్ల వివరాలను ఆధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. విశాఖపట్టణం-న్యూఢిల్లీ ఎక్స్ ప్రెస్, ఎం.జీ.ఆర్ చెన్నయ్ సెంట్రల్-చప్రా ఎక్స్ ప్రెస్, కే.ఎస్.ఆర్ బెంగళూరు సిటీ-ధనపూర్ ఎక్స్ ప్రెస్, కోయంబత్తూర్-నార్త్ పటేల్ నగర్ పార్శిల్ ఎక్స్ ప్రెస్​ను దారి మళ్లించారు.

కే.ఎస్.ఆర్ బెంగళూరు సిటీ-హజ్రత్ నిజముద్దీన్ పార్శిల్ ఎక్స్ ప్రెస్, త్రివేంద్రం-న్యూఢిల్లీ, కుద్రరోడ్-ఓఖ ఎక్స్ ప్రెస్, కుద్రరోడ్-అహ్మదాబాద్ ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్-ధన్ పూర్ ఎక్స్ ప్రెస్, గోరక్ పూర్-యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్, మైసూర్-జైపూర్ ఎక్స్ ప్రెస్, రేణిగుంట-హజ్రత్ నిజాముద్దీన్ దూద్ దురంతో రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు!

ABOUT THE AUTHOR

...view details