భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రేపటి నుంచి ఈనెల 17వరకు సికింద్రాబాద్- ఉందానగర్-సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలు, సికింద్రాబాద్-ఉందానగర్ మెము రైలు, మేడ్చల్-ఉందానగర్ మెము ప్రత్యేక రైలు, ఉందానగర్-సికింద్రాబాద్ మెము స్పెషల్ రైలు, సికింద్రాబాద్- ఉందానగర్ మెము స్పెషల్ రైలు, హెచ్.ఎస్ నాందేడ్- మేడ్చల్-హెచ్‌ఎస్ నాందేడ్, సికింద్రాబాద్- మేడ్చల్ మెము రైలు, మేడ్చల్-సికింద్రాబాద్ మెము రైలు, కాకినాడ పోర్టు-విశాఖపట్నం మెము రైలు, విజయవాడ- బిట్రగుంట మెము రైలును రద్దు చేసినట్టు దక్షిణ మద్య రైల్వే పేర్కొంది.
రెయిన్ ఎఫెక్ట్... ఈనెల 17 వరకు పలు రైళ్లు రద్దు - trains cancelled
భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రేపట్నుంచి ఈనెల 17వరకు 34 ఎంఎంటీఎస్ రైళ్లనూ రద్దు చేశారు.
34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు..వర్షాల కారణంగా ఈనెల 14 నుంచి 17 వరకు 34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. లింగంపల్లి-హైదరాబాద్ రూట్‌లో 9 సర్వీసులు, హైదరాబాగ్-లింగంపల్లి మార్గంలో 9, ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య 7 సర్వీసులు, లింగంపల్లి -ఫలక్‌నుమా రూట్‌లో 7 సర్వీసులు, సికింద్రాబాద్-లింగంపల్లి రూట్‌లో ఒకటి, లింగంపల్లి సికింద్రాబాద్ మార్గంలో ఒక సర్వీసు రద్దు చేశారు. ఉందానగర్- మేడ్చల్ మెము స్పెషల్, సికింద్రాబాద్-బొల్లారం మెము స్పెషల్, బొల్లారం-సికింద్రాబాద్ మెము స్పెషల్, మేడ్చల్-సికింద్రాబాద్ మెము స్పెషల్, సికింద్రాబాద్-మేడ్చల్ మెము స్పెషల్ రైళ్లను ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది.
ఇవీ చదవండి: