తెలంగాణ

telangana

ETV Bharat / state

Train Hotel at Kacheguda Railway Station : పరివార్ ఫుడ్​​ ఎక్స్​ప్రెస్​ వచ్చింది.. మీకు కావల్సిన ఫుడ్​ తినండి! - Pariwar food express at Kacheguda

Restaurant on Wheels in Hyderabad : హైదరాబాద్ నగర వాసులకు మరో రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. రైలులో ప్రయాణిస్తూ.. అందులో భోజనం చేస్తూ ఉంటే ఎంత అద్భుతమైన అనుభూతి ఉంటుందో.. అచ్చం అలాంటి అనుభూతి కలుగుతుంది. రాయల్ ఇంటీరియల్స్​తో రైల్వే బోగీలను తీర్చిదిద్దారు. రెస్టారెంట్ ఆన్ వీల్స్ పేరుతో.. ఈ రైలు రెస్టారెంట్ పసందైన రుచులను పంచుతుంది. ఈ రెస్టారెంట్ రైల్వే ప్రయాణికులతో పాటు.. నగరవాసులను ఆకట్టుకుంటోంది.

Train Hotel at Kacheguda Railway Station
Train Hotel at Kacheguda Railway Station

By

Published : Jul 25, 2023, 9:02 PM IST

కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే కోచ్‌లో రెస్టారెంట్

Restaurant in Railway Coach at Kacheguda Railway Station: హైదరాబాదలో రైల్వే కోచ్‌లో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణలోని రైల్వే స్టేషన్లలో రైల్వే కోచ్​లో ఏర్పాటు చేసిన.. మొట్టమొదటి రెస్టారెంట్ ఇదే అని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ ఆవరణలో.. రెస్టారెంట్ ఆన్ వీల్స్ పేరుతో ఈ రెస్టారెంట్ ప్రారంభమైంది. దీని కోసం రెండు హెరిటేజ్ కోచ్​లను అంతర్గతంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. దక్షిణ మధ్య రైల్వేలోని హైదరాబాద్ డివిజన్ కాచిగూడ రైల్వే స్టేషన్ ఆవరణలో.. ఆహార ప్రియులకు ప్రత్యేకమైన భోజనాన్ని అందించేందుకు ఈ రెస్టారెంట్​ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు.. రైల్వే శాఖ చెబుతుంది. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తుంటే.. ఎడమచేతి వైపునకు పరివార్ పుడ్ ఎక్స్​ప్రెస్ పేరుతో ఈ రెస్టారెంట్​ను తీర్చిదిద్దారు. రెస్టారెంట్​కు చేరుకోగానే.. పట్టాలపై ఉన్న రెండు బోగీలు కనిపిస్తాయి. రైలులోకి ఏ విధంగా ఎక్కుతామో.. అదేవిధంగా అందులోకి ఎక్కి లోపలికి వెళ్లగానే అక్కడ వెయిటర్ దర్శనమిస్తారు. బోగీల లోపల ఇంటీరియల్​ను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. రెస్టారెంట్​కి వచ్చిన వారు కూర్చున్న కుర్చీల పక్కనే.. లైట్లను ఏర్పాటు చేశారు. వాటిని అక్కడ కూర్చున్న వారే వేసుకునేవిధంగా తీర్చిదిద్దారు. పాతకాలం నాటి కలాకృతులను రైలు కోచ్​లలో ఏర్పాటు చేశారు.

Train Hotel Food Iteams: కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణించే ప్రయాణికులతో పాటు.. నగరవాసులకు ఈ రెస్టారెంట్ విభిన్న రకాల రుచులను పంచుతుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ పేర్కొంటుంది. రెండు ప్రత్యేకమైన కోచ్​లలో రాజస్థాన్ అద్భుత కట్టడాల మాదిరిగా తీర్చిదిద్దారు. కాచిగూడ స్టేషన్‌లోని రెస్టారెంట్ ఆన్ వీల్స్ ఐదు సంవత్సరాల కాలానికి.. సికింద్రాబాద్​కి చెందిన మెస్సరస్ పరివార్స్ హావ్ మోర్ వారికి కేటాయించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. రైలు ప్రయాణికులు, సాధారణ ప్రజలకు శుభ్రమైన, నాణ్యతతో కూడిన ఆహారం, పానియాల కోసం వివిధ రకాల వంటకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ కోచ్ రెస్టారెంట్​లో ఉత్తర భారత వంటకాలు, దక్షిణ భారత వంటకాలు.. మొఘలాయ్, చైనీస్ వంటి బహుళ వంటకాలతో పాటు, జ్యూస్, ఫాస్ట్ పుడ్, టిఫిన్స్, టీ, బిస్కట్స్ లభిస్తాయని రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సేవలను ప్రయాణికుల సౌకర్యార్థం 24 గంటలపాటు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలి రైల్ ​కోచ్ రెస్టారెంట్‌.. ఎక్కడంటే.?

రైల్లో ప్రయాణం చేసిన అనుభూతి : ఇప్పటి వరకు రైలు ప్రయాణం చేసిన అనుభూతి మాత్రమే ఉందని.. ఇప్పుడు రైలులో ప్రయాణం చేస్తున్న అనుభూతి కల్గించే రెస్టారెంట్ అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని రెస్టారెంట్​కు వచ్చిన వారు చెబుతున్నారు. ఇంటీరియల్ అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారని.. ఫైవ్ స్టార్ హోటల్ మాదిరిగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. హైదరాబాద్‌లోని ఆహార ప్రియులకు, జంటనగర వాసులకు మరొక విలక్షణమైన ఆహారానికి కేరాఫ్ అడ్రస్‌గా.. రెస్టారెంట్ ఆన్ వీల్స్నిలుస్తుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. నగరవాసులు ఈ రెస్టారెంట్​ను ఆదరించాలని కోరారు.

"స్థానికుల నుంచి రైల్వే ప్రయాణికుల నుంచి ఈ ఫుడ్​ ఎక్స్​ప్రెస్​కి ఆదరణ వస్తోంది. ఫుడ్​ తిని వారందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. రెస్టారెంట్​ అవతల టిఫిన్​, స్నాక్స్​.. లభిస్తాయి. లోపల ఫుడ్​ ఉంటుంది."-ముస్తఫా హుస్సేన్​, రెస్టారెంట్ నిర్వాహకుడు

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details