హైదరాబాద్ చిక్కడపల్లిలో నివాసముండే శ్రీధర్ అనే వ్యక్తి ఓ టీవీ ఛానల్లో రిపోర్టర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తరచుగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతుండటం వల్ల వారు విడిగా ఉంటున్నారు. హోలీ పండుగ సందర్భంగా భార్య వద్ద ఉన్న కుమార్తెను చూసేందుకు అతను వెళ్లగా ఆమె నిరాకరించింది. మనస్తాపానికి గురైన శ్రీధర్ హుస్సేన్ సాగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు.
రైల్వే పట్టాలపై మరణ మృదంగం
రైలు కిందపడి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆర్థికపరమైన ఇబ్బందులు... మనస్తాపంతో జీవితంపై విరక్తి చెంది కొందరు... ప్రేమ విఫలమై మరికొందరు రైళ్లకిందపడి ఆత్మహత్య చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో వేర్వేరు ప్రాంతాల్లో రైలు కింద పడి ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మరో ఘటనలో ప్రేమించిన యువతి ఆత్మహత్యకు పాల్పడిందని మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈస్ట్ మారేడ్‌పల్లిలో నివాసముంటన్న లక్ష్మి, రాములకు ఇద్దరు కుమారులు ఉండగా చిన్న కుమారుడైన బాలకృష్ణ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతనికి నగరంలోని ఓ యువతితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. అయితే ఈ నెల 11వ తేదీన యువతి ఆత్మహత్య చేసుకోవడం అతనిని తీవ్రంగా కలచివేసింది. తీవ్ర మనోవేదనకు గురైన బాలకృష్ణ జేమ్స్ స్ట్రీట్ సమీపంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు, థియేటర్లు, బార్లు బంద్: కేసీఆర్